పుస్తకాలు మన జ్ఞ్యానానికి ప్రతీక. దాని నుంచే మనం ఏ విద్యనైనా నేర్చుకుంటాం. అయితే పుస్తకాలు మన పూర్వీకులకు సంబంధించిన పుస్తకాలను చదివి అందులోని విషయాలను తేటతెల్లం చేసేది అర్కియాలజిస్ట్ లే. వీరు ఎన్నో పురాతన గ్రంధాలను వెలికి తీసి అందులోని విషయాలను మనo కోల్పోని విధంగా భద్రపరుస్తారు. అయితే ఈ దశలో తవ్వకాల్లో వెలికి తీసిన అన్ని పుస్తకాలు చదవడానికి వీలుగా ఉండవు. కొన్ని వేల ఏళ్ల నాటి పుస్తకాల లోని పేజిలు చిరిగి ఉంటాయి, మరి కొన్ని అక్షరాలూ కనిపించవు. మరి కొన్ని అయితే వాటిని ముట్టుకుంటేనే అవి నాశనమయ్యే స్థితిలో ఉంటాయి. అప్పుడు వాటిలో ఏముందో తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక పై అతి పురాతనమైన పుస్తకాలను కూడా ముట్టుకోకుండానే వాటిలో ఏం రాయబడి ఉందో చదవగలిగే పరిజ్ఞ్యానం అభివృద్ధి చేసారు పరిశోధకులు.

అమెరికా లోని MIT (Massachussetts Institute of Technology) మరియు George Institute of Technology కి చెందిన పరిశోధకులు సంయుక్తంగా Terahertz Imaging సాంకేతిక పరిజ్ఞ్యానం సహాయంతో ప్రాచీన పుస్తకాలలో ఏమి లిఖించబడి ఉందో తెలుసుకోవచ్చు అంటున్నారు. ఈ సాంకేతికత పరిజ్ఞ్యానం తో రూపొందించబడిన ఒక నమూనా తో ఒక పుస్తకంలోని వరుసగా 9 పేజీలలోని అక్షరాలను ఇది సరిగ్గా గుర్తించగలిగింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది ఎలా పని చేస్తుంది అంటే..

దీనిలో ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ కెమెరా (Source), రేడియేషన్ డిటెక్టర్ మరియు ఒక ప్రత్యేకమైన algorithm తో రూపొందించిన ఒక కంప్యూటర్ ఉపయోగించబడ్డాయి. కాంతి కిరణాలలో ఒకానొక wavelength కలిగినవి Terahertz కిరణాలు. ఇవి ఎక్స్ రే ల కంటే శక్తి వంతమైనవి. ఈ కిరణాలు ఏమైనా ఒక వస్తువు లోపలి పొరల్లోకి చొచ్చుకుని పోగలవు. అలాగే మూసి ఉంచిన పుస్తకంలో ఒక్కో పేజీ కి మధ్యలో కొద్ది మైక్రోమీటర్ల మందం తో గాలి నిండి ఉంటుంది. ఈ కెమెరా నుండి రేడియేషన్ ను ఏదైనా ఒక పుస్తకం మీద ప్రసరింప చేస్తే ఈ కిరణాలు పుస్తకంలోకి చొచ్చుకుని పోయి refractive index కారణంగా తిరిగి (కిరణాలు) వెనక్కు వస్తాయి. కెమెరా లోని బిల్ట్ ఇన్ సెన్సర్ ఆ రేడియేషన్ ను గుర్తిస్తుంది. ఈ కిరణాలు ఒక్కో పేజీ యొక్క ఇమేజ్ కలిగి ఉండడంతో దీనికి Terahertz Imaging అని పేరు వచ్చింది. అలా కాంతి కిరణాలు పరావర్తనం చెందిన సమయాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన algorithm ఎన్ని పేజీల్లోకి కాంతి వెళ్ళగలిగిoదో గుర్తిస్తుంది. అలాగే ఈ ప్రత్యేకమైన algorithm ఆ పేజీ లలోని సిరాను అలాగే ఒక్కో పేజీ లోని అక్షరాలూ ఆవతలి పేజీ మీద పడే నీడను బట్టి, ఒక్కో అక్షరాన్ని విడి విడిగా గుర్తించగలుగుతుంది. దీనితో ఒక్కో పేజీలో ఏం రాయబడి ఉందో మనం గుర్తించవచ్చు. అలా ఎన్ని పేజీలకు ఇమేజింగ్ చేయబడిందో కూడా తెలుసుకోవచ్చు.

అయితే ఈ నమూనా పరీక్షలో 20 పేజీ ల పుస్తకంలో మొదటి 9 పేజీలలోని అక్షరాలను మాత్రమే ఈ పద్ధతిలో గుర్తిoచబడింది. అందువల్ల దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ఈ బృoదం లో ఒకరైన Ramesh Raskar పేర్కొన్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞ్యానం అందుబాటులోకి వస్తే ఎన్నో విలువైన పుస్తకాలలోని అంతకంటే విలువైన జ్ఞ్యానాన్ని మనం పొందవచ్చు.

Courtesy