శరీర ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. ఈ ఆహారమే మనకు బలాన్ని ఇస్తుంది. ఇదే ఆహారం సరిగా తీసుకోకపోతే బరువు తగ్గిపోవడం, పెరగడం, రక్తంలో గ్లూకోస్ స్థాయి పెరగడం/తగ్గడం ఇత్యాదివన్నీ జరుగుతాయి. అంతే కాదు మన నోటిలో వైద్యులు పరీక్ష ద్వారా తప్ప కనుగోనలేని ఎన్నో ఆరోగ్య సూచికలు మన నోరు, లాలజాలం మొదలైనవి చెప్పేస్తాయి. అంతెందుకు ఆహారం తీసుకోనప్పుడు మన జీర్ణ వ్యవస్థ ఉత్పన్నం చేసే వాయువు (gases) నోటి ద్వారా బయటకి వస్తాయి. ఇలా ఇంకా ఎన్నో మనం ఊహించలేని, మనకు ఉంటాయని ఊహకు కూడా అందని జబ్బులను ముందుగా మన నోటి ద్వారా తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు.
సరిగ్గా ఈ సూత్రాన్ని ఆధారం చేసుకునే Tufts University School of Engineering కి చెందిన పరిశోధకులు (Miniature Tooth Sensor) పంటి మీద వేసుకునే అతి చిన్న సెన్సర్ ను తయారు చేసారు. అవును అత్యంత పలుచగా ఒక స్టికర్ మాదిరి ఉండే ఈ సెన్సర్ ను పంటి మీద అతికించుకుంటే, మనo ఆహారం తీసుకున్నప్పుడల్లా గ్లూకోస్, salt మరియు ఎంత ఆల్కహాల్ శరీరం లో చేరుతోంది అనే విషయాలను ఫోన్ కు వైర్లెస్ గా పంపిస్తుంది. ఇది real time లో కావడం విశేషం. ఈ సెన్సర్ చూడటానికి 2X2 mm పరిమాణంలో ఉంటుంది. ఈ సెన్సర్ కేవలం మూడు పొరలతో తయారు చేయబడింది. మొదటి, చివరి పొరలు బంగారంతో తయారు చేయగా, మధ్య పొరను bioresponsive layer అంటారు. ఈ పొర ద్వారా మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు గ్రహించబడతాయి. ఈ చతురస్రాకారంలో ఉండే సెన్సర్ ఒక యాంటెన్న లాగ పని చేసి సమాచారాన్ని రేడియోఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (ఒక రకమైన శబ్దతరంగాలు – 20kHz – 300 GHz) ద్వారా ఫోన్ కు చేరవేస్తాయి. ఇక ఎలాంటి వైర్లు, మొదలైనవి లేని ఈ చిన్న సెన్సర్ ఎలా ఆహార సంబంధ సూచనలు చేస్తుంది అంటే…
మన ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్ధం లేదా ఆల్కహాల్ తీసుకున్నామని ఎలా కనిపెడుతుంది అంటే, ఈ మధ్య పొర ఆహారంలోని ఉప్పును/ఆల్కహాల్ ను గ్రహించి రంగు మారి, ఒక రకమైన రేడియోఫ్రీక్వెన్సీ తరంగాలను ఉద్ధతితో పంపిస్తుoది. అదే గ్లూకోస్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మరొక రకమైన RF waves (Radio Frequency) ను తిరిగి ఫోన్ కు పంపిస్తుంది అంతే. ఇలా సమాచారం ఎప్పటికప్పుడు వచ్చి చేరడం వల్ల దాని నుండి వైద్యులకు/వ్యక్తులకు వారి ఆహారం ఏపాటిదో ఎలాంటిది తీసుకుంటున్నారో శాస్త్రబద్ధంగా చూపించినట్టే. ఇలాంటి సెన్సార్ల ద్వారా డయాబెటిస్, అధిక బరువు, అతిగా తినే/అతిగా మద్యం తాగేవారికి వారి వారి పరిమితులు నిర్ణయించుకోవడానికి అవకాశం లభిస్తుంది.
ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన బుద్ధికి పదును పెట్టాలేగానీ ఇంకా చాలా రకాలుగా ఈ సెన్సర్ ను రూపొందించుకోవచ్చు. ఉదా. మనం తినే ఆహారంలోని కెలోరిలను, ఆ సమాచారాన్ని ఇంత కంటే సులువుగా మరే పరికరం ఇవ్వలేదు. ఈ పరిశోధనను Advanced Materials జర్నల్ లో త్వరలో ప్రచురించబడుతుంది.