ప్రముఖ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సైబర్ సెక్యూరిటీని (Cyber Security) కెరీర్(Career)గా తీసుకునే వారి కోసం ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్(Special Training program)ను ఆవిష్కరించింది. మంగళవారం అధికారికంగా ఈ సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్(Skilling) ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.
కరోనా(Corona) వైరస్ తరువాత డిజిటల్ లెర్నింగ్‌కు ఆదరణ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త కోర్సును (New Course) రూపొందించింది. సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్(Demand) పెరిగిందని, ఎక్కువ మంది నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించనట్లు టెక్ దిగ్గజం ఓ ప్రకటనలో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇదే కావడం విశేషం.
ఈ ప్రోగ్రామ్ ద్వారా 2022 సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో 1 లక్ష మందికి పైగా స్కిల్ శిక్షణ(Skill Training) ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ థట్(Cloud that), కోయినింగ్(Koenig), ఆర్పీఎస్(RPS), సినర్జిటిక్స్(Synergetics) లెర్నింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా లెర్నర్స్(Learners)కు జాబ్ ఛాన్స్(Job Chance) ను మెరుగుపర్చడంతో పాటు సైబర్ సెక్యూరిటీ(Cyber Security)లో నిపుణులను పరిశ్రమకు అందించనుంది. విద్యాద్రులకు అరమయే విధంగా మాడ్యూల్స్(Modules)తో కోర్సు డిజైన్(Design) చేసింది. తద్వారా లెర్నర్స్ సులభంగా ప్రాథమిక అంశాల(Primary Topics)ను అర్థం చేసుకోవచ్చు.
ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సు(CB Course) గురించి మైక్రోసాఫ్ట్(Microsoft) ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి మాట్లాడుతూ ‘‘సైబర్ సెక్యూరిటీ స్కిల్ ను అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ఈ ట్రైనింగ్ లో భాగంగా పాల్గొనేవారికి ఫండమెంటల్స్(Fundamentals)లో సర్టిఫికేషన్(Certification)ను ఉచితంగా అందిస్తాం. ఈ సర్టిఫికెట్ ఉద్యోగ వేటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
సైబర్ సెక్యూరిటీలో పనిచేసే అన్ని స్థాయిల్లో ఉన్న అభ్యాసకులకు అనగా కేవలం బిగినర్స్(Beginners)కు మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్స్(Experience) పర్సన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది.’’ అని చెప్పారు.
మైక్రోసాఫ్ట్ రెడ్మండ్ గ్లోబల్(Microsoft RedMond Global) స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ కోర్సును రూపొందించింది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వివిధ డిజిటల్ స్కిల్(Digital Skill) పై ట్రైనింగ్(Training) ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో, ఇప్పటికే 30 లక్షల మందికి పైగా కొత్త నైపుణ్యా(New Skill)లపై శిక్షణ ఇచ్చింది.
ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడానికి, ఆసక్తిగల అభ్యాసకులు మైక్రోసాఫ్ట్ ఇండియా స్కిల్లింగ్ ఇనిషియేటివ్(Skilling Innitiative) వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
అందులోని సెక్యూరిటీ స్కిల్లింగ్(Security Skilling) ట్యాబ్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్(Registration) చేసుకోవాలి. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మైక్రోసాఫ్ట్ అధికారిక వెబ్సైట్ చూడాలని తెలిపింది.