మోహన్ బాబు(Mohan Babu) కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) నటి(Actress)గా, నిర్మాత(Producer)గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నటిగా పలు సినిమాల్లో నటించి తన సత్తా ఏమిటో చాటిన ఆమె ఇప్పుడు అగ్ని నక్షత్రం(Agni Nakshataram) అనే మూవీతో ఆడియన్స్(Audience) ముందుకు రాబోతున్నారు.

వాస్తవానికి ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు ప్రధాన పాత్ర(Main role)లో మరోసారి ప్రేక్షకులను అలరించబోతోంది.

మంచు లక్ష్మి మొట్ట మొదటిసారిగా తన తండ్రితో కలిసి సినిమా చేస్తోంది, అగ్ని నక్షత్రం పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రతీక్ ప్రజోష్(Pratheek prajosh) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్స్మెంట్స్‌ బ్యానర్ల(Manchu Entertainments Banner)పై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ ను వాలెంటైన్స్ డే(Valentine’s Day) సందర్భంగా హీరో(Hero) దగ్గుబాటి రానా(Daggubati Rana) రిలీజ్ చేశారు.

ఇక రానా దగ్గుబాటి విడుదల చేసిన ఈ ఫస్ట్ గ్లింప్స్(First Glimpse) లో మంచు లక్ష్మి ఒక పోలీస్ అధికారిణి(Police Officer)గా కనిపిస్తోంది. ఇక ఈ గ్లిమ్స్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్(Crime Thriller) గా ఈ సినిమా రూపొందింది అని అర్థమవుతుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీగా అనిపిస్తోంది, హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఒక మర్డర్ ను ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్గా మంచు లక్ష్మి చేసే యాక్షన్, ఆమె సినిమాలో ఉన్న సస్పెన్స్ సీన్లు(Suspense Scenes) ఆకట్టుకుంటున్నాయి.

ఒక హైదరాబాదు పోలీసు అధికారి ఈ కేసు విషయంలో ఎలాంటి దర్యాప్తు చేస్తుంది ? ఎంక్వయిరీ చేసే క్రమంలో ఆమె ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అనే విషయం మీద సినిమా తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. మరోపక్క అగ్ని నక్షత్రం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసిన దగ్గుబాటి రానా ఈ సినిమా బ్లాక్ బస్టర్(Block Buster) సక్సెస్(Success) అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక తన చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ నేమ్స్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన మంచు లక్ష్మికి టీంకి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నారు.

ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్ లో కనిపించనుండగా విలన్ గా సముద్రఖని నటిస్తున్నారు. మలయాళ నటుడు(Malayala Actor) సిద్ధిక్(Siddik) తో పాటు విశ్వంత్, జబర్దస్త్ మహేష్, చిత్ర శుక్లా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమాకి సన్ ఆఫ్ ఇండియా(Son of India) డైరెక్టర్ డైమండ్(Director Daimond) రత్నబాబు(Ratna Babu) కథ(Story) అందించగా వంశీ కృష్ణ మళ్ల(Vamsi Krishna Malla) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అచ్చు రాజమణి(Acchu Rajamani) సంగీతం(Music) సమకూరుస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.