బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) హౌస్ లో మొన్నటి వరకు హగ్ లు, ముద్దులతో రచ్చ చేసిన షన్ను, సిరి లు ఫ్యామిలీ ఎపిసోడ్ లో కుటుంబీకులు రావడంతో ఇద్దరు కంట్రోల్ లోకి వచ్చారు. కానీ మానస్, పింకీ లు మాత్రం మారట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదంటాడు మానస్, కాసేపు ఫ్రెండ్ కాదు అంటాడు, ఆ తరువాత హాగ్(Hug) చేసుకుంటూ కనిపిస్తున్నారు.
చూసే ప్రేక్షకులకు కూడా విసుగుపుట్టేలా ప్రవర్తిస్తున్న కంటెస్టెంట్స్(Contestants). మంగళవారం ఎపిసోడ్ లో మానస్, పింకీ ల గొడవ తార స్థాయి కి చేరింది.
అంతలోనే హాగ్ లతో కలిసిపోయారు ఈ యవ్వారాలతోనే ఈ షో ని నడిపించేస్తునట్టు వున్నాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్(Big Boss) షో ముగియడానికి రెండు వారాలా వ్యవధి మాత్రమే ఉండడంతో టికెట్ టు ఫినాలే(Ticket to finale) రేస్(Race) ప్రారంభమైంది. దీనిలో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న ఏడుగురిలో ఫైనల్(Final)కి చేరుకునే తొలి కంటెస్టెంట్స్ ఎవరానేది తెలియాల్సి వుంది.
మంగళవారం నాటి 87వ ఎపిసోడ్(Episode) పై ఓ లుక్ వేయండి.
ప్రియాంక, కాజల్‌ను నామినేట్(Nominate) చేయడంపై మానస్ షాక్ అయ్యాడు. తను నిన్ను సపోర్ట్ చేసింది, కానీ నువ్వు ఆమెను ఫ్రెండ్ అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావని తప్పు పట్టాడు. మానస్, నీకు ఎవరు సపోర్ట్(Support) చేశారు పింకీ అని అడుగుతాడు ‘నువ్వు’ అని అంటుంది పింకీ. నీకు సపోర్ట్ చేసింది సన్నీ, కాజల్ అని చెప్తాడు. ముందు నీ ఫ్రెండ్స్(Friends) ఎవరో తెలుసుకో అంటూ అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు. అతడు చెప్పాలనుకుంది చెప్పాడు, మరి తాను చెప్పేది కూడా వినాలి కదా అని నిలదీసింది పింకీ. నీది మాట్లాడటం అయిపోతే వెళ్లిపోతావా? అని కోపంతో ఊగిపోయింది.
అయితే కాసేపటికే మళ్లీ మానస్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పింది. అయితే అతడు మాత్రం నేనిప్పుడు మాట్లాడలేనన్నాడు. ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధపడతానని గట్టిగా అరిచేసింది పింకీ.
ఎందుకు ఏడుస్తున్నావని మానస్ అడగ్గానే ఒళ్లు కొవ్వెక్కి అంటూ ఏడ్చేసింది. నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్ చేయాలని చూస్తున్నావంటూ మానస్ అనడంతో షాకైన(Shock) పింకీ. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చేస్తుంది. దీంతో మానస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత సిరి వచ్చి ఓదారుస్తుంది.
కానీ రాత్రంతా మానస్, ప్రియాంక మధ్య వాగ్వాదానాలు జరుగుతుంటే కాజల్ మధ్యలో వచ్చి గొడవను మరింత పెద్దదిగా చేస్తుంది. దీంతో విసిగిపోయిన పింకీ ‘ఈ పంచాయితీలు వద్దు, నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో మాట్లాడాలనుకోవడం’ లేదు అంటూ మానస్ పింకీ పేస్ మీదే చెప్తాడు. అయినప్పటికీ పింకీ అతడితో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించగా కాజల్ అది జరగనివ్వలేదు .దీంతో మండిపోయిన పింకీ కాజల్‌ను షటప్ అని అంటుంది.
ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, ఇప్పుడు అర్ధమవుతోంది అందరు కాజల్ వెళ్లిపోయావాలని ఎందుకు అంటరాని, రెచ్చగొట్టి ఏమీ తేలినట్లు సైలెంట్(Silent )గా కూర్చుంటుందని నోరుపారేసుకుంది పింకీ.
ఆ తరువాత పింకీ ఇంకా భోజనం చేయలేదని తెలుసుకున్న మానస్ ఆమెను తినమని బతిమాలుతాడు. తన బాధను అప్పుకోలేకపోయిన పింకీ మానస్ ను హగ్(Hug) చేసుకుని ఏడ్చేసింది. దీంతో మానస్ ఆమెను ఓదార్చాడు. మరోపక్క కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారో అర్థం కావట్లేదంటూ షణ్ను, సిరిలు చర్చించుకున్నారు.
ఇక పింకీ తో సన్నీ ఫ్యాన్స్(Fans) తనకు ఓట్లేస్తారనే కాజల్ అతడితో క్లోజ్(Close) గా ఉందన్నాడు షణ్ను. ఇంతలో షణ్ను కెప్టెన్సీ(Captaincy) పూర్తయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్(Big Boss).
ఆ తరువాత కంటెస్టెంట్స్(Contestants) కి “టికెట్ టు ఫినాలే”(Ticket to finale) టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో మొదటి లెవల్ ‘ఎండ్యురెన్స్ టాస్క్’లో(Endurance Task) భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్ టబ్(Ice Tub)లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్‌లోని బాల్స్ తీసుకోవచ్చని చెప్పాడు. ఆట మొదలవగానే అందరూ ఐస్ వాటర్‌లో నిలబడ్డారు. కానీ సన్నీకి చెరోవైపు కాజల్, మానస్, షణ్ను పక్కన సిరి ఉండటంతో వారి బాల్స్(Balls) దొంగిలించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఇది అర్థమైన బిగ్‌బాస్(Big Boss) వెంటనే రెండో లెవల్ మొదలుపెట్టాడు షణ్ను, సన్నీలను స్వాప్(Swap) చేసుకోమని ఆదేశించాడు.
దీంతో రేపటి ఎపిసోడ్లో ఆట రసవత్తరంగా సాగనున్నట్టు తెల్సుతోంది అంతేకాదు..సిరికి, సన్నీ లు ఒక్కరి బాల్స్ ఒక్కరు తోసుకోవడం తో మరోసారి గొడవ జరిగినట్లు ప్రోమో(Promo) లో తెలుస్తోంది.