మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవము ఊపిరితిత్తులు(Lungs). ఇది శరీరం పనితీరును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడేందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ఈ వ్యాసంలో, ఇప్పుడు మనము ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాల గూర్చి చర్చించుకోబోతున్నాము.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన నివేదిక ప్రకారం, 235 మిలియన్ల ప్రజలు ఆస్త్మాతో బాధపడుతున్నారు. భారతదేశంలో, వాయు కాలుష్యం(Air Pollution) & ధూమపానం(Smoking) చేసే వారు ఎక్కువగా ఉండటంవల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలమవుతున్నాయి.
మన ఊపిరితిత్తుల నిరంతరంగా కలుషితమైన గాలికి గురవటం వల్ల, ఈ కాలుష్య కారకాలు బ్రోన్కైటిస్(Bronchitis), ఆస్తమా(Asthma), న్యుమోనియా(Pneumonia), సిస్టిక్ ఫైబ్రోసిస్(Cystic fibrosis) వంటి శ్వాసకోశ సమస్యలను మనలో పెంచుతున్నాయి.
కాబట్టి, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, దోహదపడే ఆహార పదార్ధాలను తినడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తీసుకోవలసిన ఆహారాల గూర్చి ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక గ్లాసు మోతాదులో ఆపిల్ రసాన్ని తీసుకుంటారో వారిలో గురక తక్కువగా ఉంటుంది. గర్భవతులుగా ఉన్న మహిళలు ప్రతిరోజూ ఆపిల్‌ను తినడం వల్ల పుట్టే పిల్లలలో ఆస్తమా లక్షణాలు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆపిల్స్‌లో ఫాలోలిక్(Folic) సమ్మేళనాలు & ఫ్లేవానాయిడ్లను కలిగివుంటాయి ఇవి శ్వాసనాళముల వాపును తగ్గిస్తాయి.
సాల్మన్లో(Salmon) ఉండే ఒమేగా 3(Omega 3) కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తులలో ఏర్పడిన వాపును తగ్గిస్తుంది & ఊపిరితిత్తులలో తిష్టవేసుకొని జీవిస్తున్న బ్యాక్టీరియా(Bacteria)తో కూడా పోరాడుతుంది. సాల్మొన్తో పాటు మాకేరెల్, ట్రౌట్, సార్డినెస్ & హెర్రింగ్ వంటి ఈ చేపలు ఊపిరితిత్తులకు చాలా మంచివి.
మోనో అన్‌శాట్యురేటెడ్ ఫ్యాట్‌ను & పొలేఅన్శాట్యురేటెడ్ ఫ్యాట్‌ను సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కనోల ఆయిల్స్ వంటివి కలిగి ఉంటే అవి మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెరుగుతున్న రక్తపోటుకు & బలహీనమైన రక్తనాళాల వంటి వాయు కాలుష్యంతో ముడిపడివున్న ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులకు & గుండెకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి.
గ్రీన్-టీ(Green Tea), మీ శరీరాన్ని శాంతపరచి, వాపులను(Swellings) / మంటల(Inflammation)ను తగ్గించి, మీకు స్వస్థతను చేకూర్చడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ల(Anti Oxidants)ను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటటిన్ అనేది ఒక సహజమైన యాంటిహిస్టామైన్గా పనిచేస్తుంది, ఇది అలెర్జీ లక్షణాలను కలిగించే హిస్టామైన్ను విడుదలను తగ్గిస్తుంది.
ఒక కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుందని తెలుసా ? కెఫిన్ ఒక బ్రోన్చోడైలేటర్గా పనిచేస్తుంది, ఇది ఆస్తమాటిక్స్లో గట్టి వాయు మార్గాలను తెరచి & శ్వాసకోశ కండరాల అలసటను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీను తాగటం వల్ల మీరు తీసుకునే శ్వాసను మెరుగుపరచి & మీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్, క్వినొయా & గోధుమల వంటి ధాన్యపు ఆహారాలను మీ రోజువారి డైట్లో ఉండేలా చూసుకోవాలి. మఫిన్లు, పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ వంటి మరిన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే ఆహారాలుగా ఉంటూ, కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని పెంచి, మీ ఊపిరితిత్తులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.
వెల్లుల్లిలో, గ్లూటాతియోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఫ్లేవానాయిడ్స్ కలిగివుంది, ఇది విషాన్ని & క్యాన్సింజెన్లను తొలగించడంలో సహాయపడటమే కాకుండా ఇది మీ ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండటంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు మూడు రెబ్బల పచ్చి వెల్లుల్లిని తీసుకున్నవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను 44 శాతానికి వరకూ తగ్గించగలదని ఒక అధ్యయనంలో కనుగొనబడింది.
బ్రోకలీలో విటమిన్-సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్(Keratinous), ఫైటోకెమికల్స్(Phyto Chemicals) ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయలో L- సల్ఫోరాఫాన్ అనే చురుకైన సమ్మేళనం ఉంది, ఇది శ్వాస సంబంధిత కణాల అనారోగ్యాలను నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ జన్యువులుగా రూపాంతరం చెందుతుంది.