నయం చేయడం కంటే ముందుగానే  నిరోధించడం చాలా మంచిదని చాలా మంది చెబుతుంటారు.అదే ముందు జాగ్రత్త పాటిస్తే ఎలాంటి సమస్య దరి చేరదు. అలాంటి వాటిలో ముందు గా చెప్పుకోవాల్సింది లో బిపి(Low bp) గురించే.

సకాలంలో లో బిపిని గుర్తించడం ద్వారా దీని నుంచి సులభంగా బయటపడవచ్చు.

ఎలాంటి లక్షణాల ద్వారా బిపిని గుర్తించవచ్చు?  లోబిపి ఉంటే ఎం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

శరీరం లో రక్త పోటు ఉండవలసిన స్థాయి కంటే తక్కువ స్థాయి లో ఉండడాన్ని అల్ప రక్తపోటు(Blood pressure) లేదా లోబిపి.

లోబీపీ మూలంగా గుండె, మెదడు, మూత్రపిండాలు తదితర అవయవాలకు ఆక్సిజన్, ఆహారసరఫరా  తగిన పాలలో జరగదు.

రక్త మనేది ఒక రక్త నాళాలపైనా బలంగా ప్రవహిస్తుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్(Blood Pressure) అంటారు. దీన్ని బట్టి గుండె వేగం, శ్వాస, శరీర ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది.

బీపీని సిస్టోలిక్(Systolic), డైస్టోలిక్(Diastolic) బీపీ గా కొలుస్తారు. సిస్టోలిక్ బీపీ ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో 90 నుంచి 120 ఉంటుంది.

అదే డైస్టోలిక్ బీపీ 60 నుంచి 80 మధ్యలో ఉంటే సరిపోతుంది.

లోబీపీ లో ఈ సంఖ్యలకన్నా లక్షణాలను బట్టే నిర్దారిస్తారు. అయితే 100/60 కన్నా తక్కువ ఉంటే లోబీపీ గా వ్యవహరించవచ్చు. కాబట్టి డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి బీపీని చెక్ చేయించుకుని రికార్డు చేసుకోవడం మంచిది.

గుండె, రక్త నాళాలలో లోపాలులేని కొందరు ఆరోగ్యవంతులకు కూడా కొన్ని పరిస్థితుల్లో బీపీ పడిపోతుంటుంది.

బీపీ పడిపోయాయి మెదడుకు వెళ్లే రక్తం తగ్గిపోయి కళ్ళు తిరగడం, స్పృహతప్పి పడిపోవడం వంటివి జరిగినపుడు మాత్రమే దాన్ని హైపోటెన్షన్(Hypo tension) గా పేర్కొంటారు.

లోబీపీ వచ్చేందుకు చాలా రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యం గా గర్భం దాల్చిన మహిళల్లో రక్త ప్రసారంలో మార్పులు వస్తాయి. దీనితో సహజంగానే బీపీ(BP) తగ్గుతుంది. కానీ బిడ్డకు జన్మనిచ్చాక ఈ సమస్య దాన్నంతటా అదే పోతుంది.

గుండె కవాటాల్లో సమస్యలు, గుండ సమస్యలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగా అవ్వదు ఎండోక్రైన్(Endocrine) సమస్యలు ఉంటే లో బీపీ వస్తుంది.

థైరాయిడ్(Thyroid) లో బ్లడ్ షుగర్ కూడా ఇందుకు కారణం అవ్వుతుంది.

నీళ్లను ఎంత తాగినప్పటికీ తీవ్రమైన డీహైడ్రేషన్ ఉంటే అది లో బీపీ(Low BP) కి దారి తీయవచ్చు.

శరీరంలో ఎక్కడైనా అంతర్గతంగా ఎక్కడైనా గాయమైన రక్త స్రావం ఎక్కువగా ఉంటే అది లో బీపీ వచ్చేందుకు కారణం అవ్వుతుంది.

లో బీపీ గురించి పెద్దగా బయపడల్సిన అవసరం లేదు నిజానికి వాళ్ళు హై బీపీ గల వాళ్ళకంటే అదృష్టవంతులని చెప్పచు.

కళ్ళు  బైర్లు కమ్మడం, చెమటలు పోయడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు లో బీపీ లేదా హైపోటెన్షన్ గా చెప్పుకోవచ్చు.

శరీరం డిహైడ్రేట్(De hydrate) అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువ గా ఉంటుంది. అందుకని రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు (water)తప్పనిసరిగా తీసుకోవాలి.

ఆహారాన్ని  ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. లో బీపీ వున్న వాళ్ళు నిద్రించినపుడు వెంటనే లేస్తే తల తిరగడం, గుండె దడగా అనిపించడం జరుగుతుంది.

లో బీపీ(Low BP) వున్న వారికి కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు సరిగా పని  చేయకపోవడం వల్ల యూరియా, క్రియాటినిక్లాంటి పదార్ధాలు రక్తంలో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.

లో బీపీ లక్షణాలు కనిపించగానే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. బీపీ ని ఎప్పుడు సాధారణ స్థాయి లో వుండేలా చూసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.

లో బీపీ సమస్య తరుచు ఎదుర్కొంటుంటే దాన్ని సాధారణ స్థాయికి తీసుకు రావడం అనివార్యం.

ఏదేమైనా లో బీపీ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదు వెంటనే వైద్యుడి(Doctor)ని సంప్రదించి తగిన చికిత్స  చేయించుకోవాలి.