మనుషులకు సూర్యునికీ విడదీయరాని సంబంధం ఉంది. మానవులు ఆయన శక్తిని ఎండ ద్వారా గ్రహించాల్సిందే. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యం. అలా అని శరీరానికి అవసరానికి మించి ఎండ తగలడం మంచిది కాదు. ఎందుకంటే సూర్యుడు నుంచి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో తీవ్రత కలిగిన కిరణాలు భూమిని తాకుతాయి. ఈ అధిక శక్తివంతమైన కిరణాలకు (UV రేడియేషన్) ఎక్కువ సేపు గురైతే అది స్కిన్ కాన్సర్ కు కూడా కారణమవుతుంది.

మరి ఇందుకోసం కాలాన్ని బట్టి గొడుగు, సన్ స్క్రీన్ వంటివి వాడటం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అలా అని అసలు ఎండకే దూరమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. మన శరీరానికి కావలసిన vitamin D, సూర్యుని నుంచీ పొoదడమూ అవసరమే. మరేo చేయాలి, మనకు ఎంత సేపు ఎండ సురక్షితమో ఎలా తెలుస్తుంది, అనుకుంటే – ఆ లోటును తీర్చడానికి వచ్చేసింది L’Oreal వారి My UV patch.

దీనిని ఈ సంస్థ లాస్ వేగాస్ లోని CES 2016 show లో ప్రదర్శించింది. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి సారి మనం ఎంత UV రేడియేషన్ కు గురి అవుతున్నామో తెలియ చేసే wearable స్కిన్ patch. ఇది చూడడానికి హార్ట్ షేప్ లో ఉండే ఒక చిన్న టాటూ లా ఉంటుంది. ఇది పూర్తిగా ఐదు పొరలతో తయారైంది. అల్లాంటి ఈ patch కేవలం 50 మైక్రోన్స్ మoదం (అంటే మన వెంట్రుక కంటే తక్కువ మందం)తో తయారైన దీనిని మన శరీరం మీద ఎక్కడైనా వేసుకోవచ్చు. దీనిలోని adhesive (జిగురు) చర్మానికి ఎలాంటి మచ్చ అలాగే హాని చేయదు. దీనిని ఉపయోగించడం చాలా సులభం. దీనిని కొన్ని రోజుల తరబడి కూడా ఒంటి మీద ఉంచుకోవచ్చు. అయితే దీనిని ఉపయోగించాలంటే మాత్రం iOS మరియు Android స్మార్ట్ ఫోన్ ఉండాలి.


ఇది ఎలా పని చేస్తుంది అంటే ఈ patch వేసుకొని ఎండలోకి వెళ్ళినప్పుడు దీనిలోని photo sensitive dye (కాంతికి ప్రతిస్పందించే dye) శరీరానికి తగులుతున్న రేడియేషన్ ను బట్టి రంగులు మారుతుంది. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లోని దీనికి సంబంధించిన యాప్ కెమెరా వ్యూ తో ఓపెన్ అయ్యి దీనిని photo తీస్తుంది. ఆ photo ద్వారా ఈ యాప్, సమాచారాన్ని విశ్లేషించి మనo ఎంత రేడియేషన్ కు గురయ్యామో చెప్పేస్తుంది. అలాగే ఆ రోజుకు మనం తగినoత సూర్య రశ్మిని పొందామా లేదా అన్నది కూడా ఒక గ్రాఫ్ ద్వారా చెప్పేస్తుంది.

అంటే, ఎంత రేడియేషన్ మీ శరీరం గ్రహిస్తోంది వంటి వివరాలు ఈ యాప్ లో మాత్రమే తెలుస్తుంది. అయితే ఇందుకోసం మొదట్లో ఈ యాప్ వాడటం కొoచెం ఇబ్బంది కలిగించినా ఏ సమయంలో ఎంతవరకూ ఎండలో తిరగడం సురక్షితమో, కొద్ది రోజులలో మీకే తెలిసి పోతుంది, అంటోంది ఈ సంస్థ.

ఈ UV patch ను L’Oreal ఈ సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే ఈ patch ను ఈ సంస్థ ఇతర కాస్మెటిక్ ఉత్పత్తులతో ఉచితంగా ఇవ్వనుంది.

మానవ మనుగడకు అత్యంత అవసరమైన సూర్య రశ్మి మనకు ఎంత వరకూ అవసరమో తెలియచెప్పే ఇంతటి సులభమైన పద్ధతులు అందుబాటులోకి రావడం మనoదరికీ మంచిదే కదూ.

Courtesy