బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) ఐదో వారం లో  గొడవలు కొనసాగుతున్నాయి. జెస్సీ, సిరి, షన్ను ఒక టీంగా ఏర్పడి శ్రీ రామ్ తో ఫుడ్ విషయం లో గొడవలకు దారి తీయడం తెలిసిందే.

జెస్సీ మాట్లాడిన విధానం వల్లే ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకోండి అని అనాల్సి వచ్చిందని , ఇది జెస్సీ నాకు మధ్య వాదన అయితే నువ్వు ఎందుకు మధ్య లో వస్తున్నావని షన్ను తో శ్రీ రామ్ ఆర్గుమెంట్ కి దిగుతాడు.

అయితే షన్ను జెస్సీ నా  ఫ్రెండ్   కాబట్టి మాట్లాడుతాను అంటే ఏమి తెలుసుకోకుండా మధ్యలో రావడం కరెక్ట్ కాదని ఏజ్ గురించి పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతాడు శ్రీ రామ్.

దీనితో చిరెత్తుకొచ్చిన సిరి, షన్ను వాగ్వాదానికి దిగుతారు. ఈ గొడవతో సిరి, జెస్సీ, షన్ను, హమీద, శ్రీరామ్ ఏమి తినకుండా ఫుడ్ మీద కోపాన్ని చూపెడతారు.

మరుసటి రోజు మాత్రం గొడవలను పక్కన పెట్టి బ్రేక్ ఫాస్ట్ బాగానే లాగించేసారు.

తరువాత అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌(Amazon Great India Festival)లో భాగంగా హౌస్ మేట్స్(House mataes)  వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్(Big Boss).

ఇందుకోసం కెప్టెన్‌ శ్రీరామ్‌.. ప్రియ, షణ్ముఖ్‌, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు.

మొదటగా ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే ఛాన్స్ కొట్టేసింది .

తర్వాత షణ్ముఖ్‌. ఈ రోజు తానూ ఇక్కడిదాకా వచ్చాడంటే అందుకు కారణం డైరెక్టర్‌ సుబ్బు అని, తన కోసం ల్యాప్‌టాప్‌ బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపాడు.

మానస్‌.. తన తల్లికి బ్రాండెడ్‌ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు.

హమీదా.. తన తల్లికి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది.

మరో పక్క కాజల్ రవి లోబో లను సరదాగా టీజ్(Tease) చేయడం తో రచ్చ మొదలైంది.  నెల రోజుల గా లోబో, రవి వాష్‌రూమ్‌ క్లీనింగ్‌ తప్ప కిచెన్‌ పక్క  చూడట్లేదని సెటైర్‌ వేసింది కాజల్‌.

చిందులేస్తూ కాస్త ఫన్ చేసింది. అయితే ఫన్ అనేది కొంతవరకు ఉంటేనే బాగుంటుందని అని కాజల్‌పై మండిపడ్డాడు రవి.

kajal

ఇక లోబో అయితే ఏకంగా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో లోబో చేసింది తప్పని వాదించింది కాజల్‌.

ఇదే విషయాన్ని కాజల్‌ పింకీతో చెప్పుగా తనకుగానీ అలా వేలు చూపిస్తే కట్‌ చేసి పడేసేదాన్ని అని చెప్పింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు తావు లేనందున అక్కడి నుంచి వచ్చేసానంది .

నెల రోజుల నుంచి కిచెన్‌లోతానేమీ పని చేయలేదని ఎలా స్టేట్‌మెంట్‌ ఇస్తావని కాజల్‌ను ని గట్టిగా ప్రశ్నించిన రవి. దీంతో మాట మార్చిన కాజల్‌ కేవలం మీకు కిచెన్‌ డ్యూటీ రాలేదని మాత్రమే అన్నానని మాట మార్చేసింది.

కాజల్‌ వింత ప్రవర్తన చూసిన మానస్‌ ఎందుకు అరుస్తున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? అని ప్రశ్నించాడు.

ఇదేమీ పెద్దగా పట్టించుకోని కాజల్‌ (Kajal) .. అయినా రవిని నా ఫ్రెండుగా ఉండమని ఎప్పుడైనా అడిగానా? అని నోరుపారేసుకుంది.

kajal and team

లోబో మిడిల్‌ ఫింగర్‌ (Middle finger) చూపిస్తే సపోర్ట్‌ చేస్తున్నావు అనడంతో షాకైన రవి. అలా వేలు చూపించడం తప్పని లోబోకి వార్నింగ్ ఇచ్చానని చెప్పిన  రవితో వాగ్వాదానికి దిగింది.

ఇక శ్రీరామ్‌ వీళ్ల మధ్య గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేసినా ఎవరూ అతడు మాటను పట్టించుకోలేదు.

తర్వాత ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ అనే కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల టాస్క్‌ ను ఇచ్చిన బిగ్‌బాస్‌(Big Boss).

ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా హౌస్ మేట్స్  ప్రజలుగా వ్యవహరిస్తారు. ఇద్దరు రాకుమారులు వారి దగ్గర ఉన్న నాణాలను టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది .

టాస్క్‌(Task) పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని దక్కిన్చుకుంటారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే ఛాన్స్ అందుకుంటారు.

దీంతో రవి, సన్నీ సపోర్ట్‌ కోసం హౌస్‌మేట్స్‌(House mates) వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్‌ రవికి విశ్వ, శ్రీరామ్‌, హమీదా, శ్వేత, యానీ మాస్టర్‌ సపోర్ట్‌ చేయగా, సన్నీకి మానస్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ప్రియ, షణ్ముఖ్‌, జెస్సీ,సిరి మద్దతుగా వుంటారు . తర్వాత సడన్‌గా సిరి, రవి గ్యాంగ్‌లో చేరుతుంది.

అయితే ఖజానాలో నుంచి ఒక్క పైసా దొంగిలించేది లేదని విశ్వ కుండ బద్ధలు కొట్టి చెప్తాడు. కానీ జెస్సీ, సిరి, షణ్ముఖ్‌, కాజల్‌ మాత్రం దొంగిలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఇంతలో ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చిల్లరోలు, చేతగానోళ్లు చేసే పనులంటూ రెచ్చిపోతాడు.

తర్వాత  ‘మట్టిలో మహాయుద్ధం’ అనే కుస్తీ పొట్టిలను జరపాలని ఆదేశించిన బిగ్ బాస్. ఈ  కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్‌; సన్నీ వైపు నుంచి మానస్‌, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి.

మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో  తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ కోసం వెయిట్ చేయాల్సిందే…….