Zika. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచాన్నే గడ గడలాడిస్తోంది. ప్రపంచ దేశాలు దీని దెబ్బకు విలవిలలాడి పోతున్నాయి. WHO (World Health Organaization) అయితే ఫెబ్రవరి 1 న ఈ “Zika” ను ఒక Public Health Emergency of International Concern (PHEIC) గా నిర్ధారించింది. మరి దాని గురించిన వివరాలు తెలుసుకుందామా…

zikaFeatured

ఈ “Zika” అనేది “Aedes Aegypti” అనే ఒక దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే virus. దీనిని మొట్ట మొదటి సారి 1947 లో యుగాండా లోని Zika అడవిలో దీనిని గుర్తించారు. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ దోమ పగటి పూట కాటు వేస్తుంది. అందువల్ల దీని పట్ల కొoచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత వరకూ దీనికి మందు కనుగొనలేకపోవడం ఈ తీవ్రతకు కారణం. అంతే కాదు ఇది అందరి కంటే ఎక్కువగా గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తుంది. ఈ virus సోకితే వారి బిడ్డలు తీవ్రమైన neurological disorders తో పుడతారు. అది వారి మానసిక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కూడా ఈ virus కు భయపడడానికి ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఇప్పటికే ఈ virus ప్రభావిత దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ఆడవారికి 2018 వరకూ గర్భo ధరించడాన్ని వాయిదా వేసుకోమని సూచనలు చేస్తున్నారు. అంతే కాదు ప్రపంచ దేశాల్లోని విమానాశ్రయాల్లో ఈ virus సోకిన దేశాలకు ఫ్లైట్లు రద్దు చేసారు అంటే దీని తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ virus South and central america లోని దేశాలు, ఆఫ్రికా లోని cape verde లో ఈ virus ప్రబలింది. అయితే ఈ దేశాలను సందర్శించిన అంతర్జాతీయ ప్రయాణీకుల వల్ల మిగతా దేశాలకు ఈ virus సోకే ప్రమాదం ఉండచ్చు అంటున్నారు వైద్యులు.

Factfile on the Zika virus after warnings of an outbreak in parts of South America.

zika2 zika4 zika3

మరి ఈ జ్వరం లక్షణాలు, దీన్ని నివారించడానికి ఏం చేయాలో తెలుసుకుందామా. ఈ దోమ కాటుతో సోకే ఈ virus లక్షణాలు ఇలా ఉంటాయి.
• జ్వరం
• రాష్
• జాయింట్ పెయిన్
• ఒళ్ళు నొప్పులు, తల నొప్పి
• Conjunctivitis (కండ్ల కలక)
అయితే మన దేశపు అధిక జనాభా దృష్ట్యా దీని నుంచీ మనకూ రక్షణ ఎంతో అవసరం. అందువల్ల మనం దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి
• virus సోకిన దేశాలకు ప్రయాణాలు మానుకోవడం
• ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ దేశాలకు వెళ్ళాల్సివస్తే వారి ప్రయాణం మానుకోవడం మంచిది.
• ఈ దోమ పగలే కాటు వేస్తుంది, అందువల్ల ఎక్కడికి వెళ్ళినా పగటి పూట దుస్తులతో ఒంటిని పూర్తిగా కప్పుకుని వెళ్ళడం మంచిది
• అలాగే mosquito repellent cream రాసుకుని ఉండడం తప్పనిసరి
• ఇంట్లో ఎక్కడా దోమలు ఉండకుండా చూసుకోవాలి
• ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
• దోమలను తరిమే కొట్టే మొక్కలైన లెమన్ గ్రాస్, citronella, basil, lavender, mint, rosemary వంటి వాటిని పెంచవచ్చు
ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి మనకు రక్షణ లభిస్తుంది.

Courtesy