విశ్వనటుడుకమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు(Politics) చేస్తూనే మరోవైపు చిత్రాలను చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) విక్రమ్ అనే మూవీ చేస్తున్నారు.
ఈ సినిమాకు (lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ సేతుపతి(Vujay Sethupathi), ఫహద్ ఫాసిల్(Fahad Fasil) అనే మరో ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ నటించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్(Shooting) నిన్నటితో పూర్తయింది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రకటనను సోషల్ మీడియా(Social media)లో రిలీజ్(Release) చేశారు చిత్రబృందం(Movie unit). ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ క్రమంలో ‘విక్రమ్’విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మార్చి 14న ఉదయం 7గంటలకు ఈ విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.
ఇక మరోవైపు (Vikram) ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్(Telugu Rights)కు మంచి రేటు వచ్చిందని తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ రైట్స్(Dubbing Rights) దాదాపు రూ.11 కోట్ల(RS.11Crores) వరకు అమ్ముడు పోయాయట.
ఇక్కడ విశేషమేమంటే..
కమల్ హాసన్ తెలుగులో హిట్టు సినిమాలు లేక పది సంవత్సరాలు దాటింది. కమల్ హాసన్ (Kamal Haasan)హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం’ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు.
అయిన ఈ సినిమాకు పదకొండు కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ కూడా కలిసివచ్చిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. లోకేష్ (lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి సక్సెస్ ని సాధించాయి. బయ్యర్ల(Buyers)కు ప్రాఫిట్(Profit) ను కూడా అందించాయి.
ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్(Anirudh RaviChander) మ్యూజిక్(Music) అందిస్తున్నారు. ఇక కమల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన విక్రమ్ సినిమా టీజర్(Teaser) ఫాన్స్ , ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద హైప్ కూడ పెరిగాయి. విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రం(232 movie)గా వస్తోంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్(Political action thriller) గా రూపొందే ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్(Rajkamal Banner)పై నిర్మిస్తున్న, 50వ సినిమా. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం పోయిన సంక్రాంతి(Sankranthi)కి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని(Block Buster Success) అందుకుంది.ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.