తమిళ హీరో(Tamil Hero) కార్తి(Kaarthi) వరుసగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఖైదీ మూవీ(Khaidi Movie)తో తన కెరీర్(Career)లోనే పెద్ద సక్సెస్(Big Hit) ని అందుకున్న కార్తి, ‘పొన్నియన్ సెల్వన్(Ponniyan Sevan)’ లాంటి భారీ(Huge) పాన్ ఇండియా(Pan India) మూవీలో కీలక పాత్ర(Key Role) పోషించారు. ఈ సినిమా రెండు భాగాల్లోనూ కార్తి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇక కిందటేడాది ‘సర్దార్(Sardar)’ మూవీతో మరో బ్లాక్ బస్టర్(Block Buster) అందుకున్నారు కార్తి. ప్రస్తుతం కార్తీ తన 25వ సినిమా కోసం వైవిధ్యమైన కథ, పాత్ర ఎంపిక చేసుకున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్(Raju Murugan) దర్శకత్వం(Direction)లో కార్తి హీరోగా అడ్వెంచరస్ థ్రిల్లర్(Adventerous Thriller)గా రూపొందుతోన్న చిత్రం ‘జపాన్(JAPAN)’.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures)పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కార్తీకి 25వ(25TH Movie) చిత్రం ‘జపాన్’ అనే టైటిల్‌ను ప్రకటించి ఫస్ట్ లుక్(First look)ను విడుదల చేసినప్పుడే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.
టైటిల్ వెరైటీగా ఉండటం, కార్తి పాత్ర చిత్రీకరణ కొత్తగా ఉండటంతో ఈ హీరో మళ్లీ ఏదో కొత్తదనం చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈరోజు కార్తి పుట్టినరోజు సందర్భంగా ‘జపాన్’ టీజర్ రిలీజ్(Teaser Released) చేశారు.
జపాన్ టీజర్ ద్వారా హీరో పాత్రని పరిచయం చేశారు. ఈ సినిమాలో కార్తి ఒక పెక్యులర్ పాత్ర(Peculiar Role) లో నటిస్తున్నారు. హీరో గురించి వేర్వేరు వ్యక్తులకు విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు అతను హీరో, కమెడియన్, విలన్. గ్లింప్స్ లో కార్తి గిరజాల జుట్టుతో వైవిధ్యంగా, హిలేరియస్‌గా కనిపించారు.
ఈ టీజర్ బట్టి చూస్తుంటే కార్తి స్టైల్ కామెడీతో పాటు ‘జపాన్’ అడ్వంచర్ రైడ్‌ను అందించబోతోందని అర్థమవుతోంది. ఇక టీజర్ ఆఖరిలో కొంత మంది హీరోని ఎవడ్రా నువ్వు అని అడగగానే జపాన్ మేడ్ ఇన్ ఇండియా అంటూ కార్తి చెప్పే డైలాగ్ హైలైట్. ఇక ఆఖరిలో కార్తి నవ్వుతున్నప్పుడు బంగారం పళ్లు కనిపించాయి.
మొత్తం ఈ సినిమాలో కార్తి క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అని టీజర్ చూస్తే తెల్సుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి(Deepvali)కి రిలీజ్ చేయనున్నారు. ఇక హీరోయిన్(Heroine) గా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్(Anu Immanuel) నటిస్తున్నారు. టాలీవుడ్ నటుడు(Tollywood Actor) సునీల్(Sunil) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్(Cinematographer) విజయ్ మిల్టన్(Vijay Milton) ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ఈ చిత్రానికి మ్యూజిక్(Music) సమకూరుస్తున్నారు ఈ సినిమాకు ఫిలోమిన్ రాజ్(Philemon Raj) ఎడిటర్(Editor) నేషనల్ అవార్డ్ విన్నింగ్(National Award Winning) ప్రొడక్షన్ డిజైనర్(Prodction Designer) వినేష్ బంగ్లాన్(Vinseh Banglan) ‘జపాన్’కు పనిచేస్తున్నారు.