కచోరి(Kachori) అత్యంత ప్రసిద్ధ టీ-టైమ్(Tea Time) స్నాక్స్(Snacks). ఈ జోధ్పురి స్టైల్(Jodhpuri Style) ఆలూ ప్యాజ్ కచోరీ(Aloo Pyaz Kachori) చాలా క్రిస్పీ(Crispy)గా, రుచి(Taste)గా ఉంటుంది. కచోరి అందరికీ నచ్చే అటువంటి చిరుతిండి. ఈ స్పైసీ డీప్-ఫ్రైడ్(Deep Fried) స్నాక్ చూడడానికి బయట నుంచి చాలా క్రిస్పీ గా లోపల వున్నా స్టఫ్(Stuff) చాలా రుచి ఉంటుంది.
కచోరీ వంటకాలు ఎన్నో వెరైటీస్ ఉన్నపటికీ, మసాలాలతో ఆలూ మరియు ఉల్లిపాయలతో తయారు చేసే కచోరికీ మించినది ఏది లేదు. ఈ జోధ్పురి-స్టైల్ కచోరీలో వేయించిన పచ్చిమిర్చి మరియు గ్రీన్ చట్నీ(Green Chutney)తో కలిపి వేడి వేడి గా సర్వ్(Serve) చేస్తే ఆ టేస్టీయే వేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రాజస్థానీ స్నాక్(Rajasthan Snack)ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చదివేయండి!
ఆలూ ప్యాజ్ కచోరికి కావాల్సిన పదార్థాలు
మైదా – 1.5 కప్పు
నూనె – 3 టిస్పూన్
ఉప్పు – సరిపడా
కొత్తిమీర – 1 tsp
జీలకర్ర – 1 tsp
ఫెన్నెల్ – 1 tsp
వెల్లుల్లి రెబ్బలు – 1 టిస్పూన్
పచ్చిమిర్చి – 2
శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు
చిన్న ఉల్లిపాయ – 1
ఇంగువ – 1 చిటికెడు,
ఉడకబెట్టిన బంగాళా దుంప – 1
షుగర్ – 1/2 టీ స్పూన్లు.
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా
చాట్ మసాలా – 1 టీ స్పూన్
కారం – 1/2 tsp
తయారు చేయు విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, నూనె వేసిబాగా కలిపి క్రమంగా నీళ్ళు పోసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. దీన్ని తడి గుడ్డతో కప్పి, 30 నిమిషాలు పక్కన పెట్టండి. జీలకర్ర(Cumin Seeds), కొత్తిమీర(Coriander) మరియు సోపు గింజల(Fennel Seeds)ను మిక్స్ లో వేసి కచ్చాపచ్చాగా పొడిని గ్రైండ్(Grind) చేసుకోవాలి.
మీడియం మంట మీద ఒక పాన్ ఉంచి, పాన్(Pan)లో కొంచెం నూనె వేసి వేడి చేయండి. సిద్ధం చేసుకున్న పొడిని వేసి 2-3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తరువాత శెనగ పిండి వేసి, మీకు మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. స్టవ్ ని ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఎర్ర కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, చాట్ మసాలా(Chaat Masala), ఇంగువ(Hing), పంచదార మరియు ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి. తయారు చేసిన పిండిని చిన్న బాల్స్ గా చేసి, వాటిని మీ అరచేతులలో చదును చేయండి. పిండి మధ్యలో 1 టేబుల్ స్పూన్ సిద్ధం చేసిన మిశ్రమాన్ని, మీ వేళ్లను ఉపయోగించి అంచులను సున్నితంగా మూసివేయండి. బాణలిలో నూనె వేడి చేసి, తయారు చేసుకున్న కచోరీలను బంగారు గోధుమ రంగు(Golden Color) వచ్చేవరకు క్రిస్పీగా వేయించాలి. జోధ్పురి తరహా ఆలూ ప్యాజ్ కచోరీ రెడీ అయ్యినట్టే. వీటిని వేయించిన పచ్చి మిర్చి, అలాగే గ్రీన్ చట్నీ లేదా స్వీట్ చట్నీ(Sweet Chutney) తో సర్వ్ చేయండి.