బిగ్ బాస్ సీజన్5(Big Boss season5) శుక్రవారం నాటి కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల టాస్క్ లో షణ్ముఖ్-సన్నీల మధ్య రచ్చ బిగ్ బాస్(Big Boss) హౌస్‌ను రణ రంగంగా మార్చేసింది. అంతేకాదు సిరి, ఆనీమాస్టర్లు కూడా రెచ్చిపోయి గొడవకు దిగారు.
దీంతో శనివారం వీకెండ్ (Weekend) ఎపిసోడ్లో హోస్ట్ నాగ్ సార్ ఎవరికి క్లాస్ పీకబోతున్నారు? అసలు తప్పు ఎవవరిదని చెప్పనున్నారో అనే సస్పెన్స్ తో వీకెండ్ షో 70వ ఎపిసోడ్ మొదలైంది.
ఈ వీకెండ్ భీమాల నాయక్ మూవీలోని టైటిల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగ్. ఇక ఆనీ మాస్టర్ రవి కెప్టెన్ అయినందుకు సంతోషంతో రవి దగ్గర డాన్స్ చేస్తూ కనిపించింది.
ఇక సిరి, షణ్ముఖ్ ఒళ్లో పడుకుని ఐ లవ్ యూ అంటూ కన్నీరు పెట్టుకుంది . నోటికొచ్చినట్టు వాగాడు సోది సోది అంటూ సిరి నోరు జారడం మొదలుపెట్టింది. సర్లే నీకు నేను ఉన్నా కదా అని షణ్ముఖ్ అనడంతో రెండో సారి ఐ లవ్యూ అంటూ ఎప్పటిలాగే హాగ్ చేసుకుంది.
మరోవైపు సన్నీ, మానస్ దగ్గర కూర్చుని ఆడాళ్లకి ఒక రూల్ మగాళ్లకి ఒకరూల్నా షర్ట్ పట్టుకుని లాగింది..
మనం అయితే ఆడపిల్లల డ్రెస్ పట్టుకోగలమారా? అని సన్నీ అంటే పట్టుకో అని అంటుంది కదా అని అన్నాడు మానస్. కామెన్సెన్స్(Common Sense) ఆమెకు లేకపోతే నాకు ఉంది అని సన్నీ అంటే షర్ట్ పట్టుకుని లాగు అని ఆమే అంటుంది.
ఆ అమ్మాయి నోరు ఎంత దారుణంగా జారుతుందో అని మానస్ అంటే అంత గల్లీజ్ మాట్లాడే అమ్మాయిని ఇంత వరకూ చూడలేదు అని అన్నాడు సన్నీ.
ఇక రవి, షణ్ముఖ్, సిరి, సన్నీ గురించి మాట్లాడుకుంటూ ఆడాళ్ల సపోర్ట్‌తో ఆట ఆడుతున్నావు అని ఎలా అంటాడు అంటూ సిరి అంటే రవి,షణ్ముఖ్‌లు అవునంటూ వంత పాడారు.
మరోవైపు సన్నీ-కాజల్, మానస్ దగ్గర కూర్చుని. నాకు షణ్ముఖ్‌తో మాట్లాడాలని ఉంది అని అన్నాడు. దీంతో కాజల్ వెళ్లి మాట్లాడరా బాబూ వెళ్లి సారీ చెప్పెయ్ అని అన్నది. సారీ అన్నావంటే ముందు నిన్ను పూల్‌లోకి తోస్తాను అని అన్నాడు.
నువ్వు వెళ్లి ఆనీ మాస్టర్‌కి సారీ చెప్తావా? అని అడిగాడు. తప్పు ఆమె చేస్తే నేను ఎందుకు సారీ చెప్తా అని అన్నది. మరి నీకో న్యాయమా? నాకో న్యాయమా? అన్నాడు సన్నీ.
ఆడాళ్లను ముందు పెట్టి గేమ్ ఆడతాడని ఫ్లోలో అనేశా తప్పితే కావాలని అనలేదు అని అన్నాడు సన్నీ. ఆ టైంలో షణ్ముఖ్ నడుచుకుంటూ వెళ్తుండగా సిరి షన్నూని పిలిచి నైస్ టీ షర్ట్ అని అన్నాడు.
షణ్ముఖ్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇక ప్రియాంక-మానస్‌ల మధ్య వాడడం జరుగుతుంది. ఎందుకు అరుస్తునవ్ మానస్ అని పింకీ అంటే నాకు నచ్చదు అంటే ఆపేయాలి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మానస్ ప్రియాంకపై ఫైర్(Fire) అయ్యాడు.
తర్వాత సువర్ణ భూమి టాస్క్(Suvarna Bhoomi Task) లో ఇంటి సభ్యులు పాల్గొన్నారు . ఈ టాస్క్‌లో ఇద్దరు హౌస్ మేట్స్(House mates) డైస్ గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో సన్నీ, ప్రియాంకలు పాల్గొన్నగా ఇందులో పింకీ గెలిచి రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని తెగ సంబరపడిపోయింది.
ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని తెలిపారు. నాగ్ సార్ కూడా సీక్రెట్ రూమ్(secret room) లో వున్న జెస్సీ తో మాట్లాడారు.
ఆ తరువాత నాగార్జున హౌస్ మేట్స్ తో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ, కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్(Nagini Dance) చేస్తూ ఆమెను వెక్కిరించింది.
అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు(Contestants) యానీకే సపోర్ట్ చేశారు.
తర్వాత రవి,వెరీ బ్యాడ్ బిహేవియర్(Bad Behaviour), లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని మాట మార్చాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో(Video) ప్లే చేశాడు.
సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్(Tower)ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది.
అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని గట్టిగా మాట్లాడింది.
తర్వాత సన్నీ,సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్, యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది కొట్టిపడేసారు.
శ్రీరామచంద్ర, ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా వంద రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని వయ్యారాలు పోయింది.
హౌస్మేట్స్(House mates) సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు.
తర్వాత కాజల్,యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు(Contestants) సిరి వాదనకు వోట్ వేయడం గమనార్హం. తర్వాత షణ్ను నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్(Youtube) వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో(Video) కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ, అతడు షణ్నును యూట్యూబ్(Youtube) వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని చెప్పే ప్రయత్నం చేశారు.
కానీ మెజారిటీ కంటెస్టెంట్లు(Contestants) షన్ను కు మద్దతు ఇచ్చారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది.
సిరి, సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్, యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్.
మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు(Guilty Board) వేలాడదీశారు. ఆ తర్వాత నామినేషన్స్(Nominatons) లో ఒక్కరిని సేవ్ చేయవలసి ఉండగా సన్నీ సేవ్(Save) అయినట్లు ప్రకటించాడు నాగ్…..