మనమందరం జీడిపప్పు(Cashew nut)ను తినడానికి ఎంతో ఇష్టపడతాం. పాయసం, స్వీట్స్ లో దీని వాడకం(Usage) తప్పనిసరిగా ఉంటుంది. కానీ అది పండే పండ్ల గురించి మనకు ఏమి తెలుసు? జీడిపప్పు కూడా పండు నుంచే వస్తుందని చాలా మందికి తెలియదు. జీడి మామిడి పండు(Jeedi mamidi pandu) లేదా క్యాషూ ఆపిల్ ఫ్రూట్(Cashew Apple Fruit) లో యాంటీ ఆక్సిడెంట్స్(Anti Oxidants) మెండుగా ఉంటుంది. ఈ జీడీ మామిడి పండులో అనేక ఆరోగ్య ప్రయాజనాలు(Health Benefits) వున్నాయి. అంతే కాదు ఈ పండుతో టేస్టీ(Tasty) రెసిపీస్ (Recipes) కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే ఆ రెసిపీస్ ఏంటో ఇక్కడ చూద్దాం!
జీడిమామిడి పండు జామ్
కావాల్సిన పదార్థాలు :
క్యాషూ ఆపిల్స్ – 12
లవంగాలు – 6
యాలకలు – 2
దాల్చినచెక్క – 3
చక్కెర – 3/4 కప్పు
నీళ్లు – 1 గ్లాస్
నిమ్మకాయ – హాఫ్
బీట్రూట్ – హాఫ్(ఆప్షనల్)
తయారు చేయు విధానం:
జీడీ మామిడి పండు తోలు తీసి ఒక బౌల్ ఆ పండ్లను స్క్విజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్విజ్ చేసుకున్న జీడీ మామిడి జ్యూస్ ను మరో బౌల్ లోకి ఫిల్టర్ చేసుకోవాలి. బీట్రూట్ని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్స్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి, అలా వేయించుకున్న మిశ్రమంలో జీడీ మామిడి జ్యూస్, బీట్రూట్(Beetroot) జ్యూస్ వేసుకోవాలి. ఈ జ్యూస్ ని బాగా మరిగించుకుని కాస్త దగ్గరకి వచ్చాక పంచదార వేసి మరి కొద్దీ సేపు ఉడికించాలి. ఇలా ఉడుకుతున్న మిశ్రమంలో నిమ్మ రసం కూడా వేసి మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అంతే క్యాషూ ఆపిల్ జామ్(Jam) రెడీ అయినట్టే . ఈ జామ్ చల్లారాక ఎయిర్ కంటైనర్ జార్ లో నిల్వ చేసుకుని కావలసినప్పుడు బ్రెడ్ స్లైస్ తో ఆస్వాదించండి.
జీడీ మామిడి, ఆరంజ్ జ్యూస్
కావాల్సిన పదార్థాలు :
జీడీ మామిడి – 4/5 పండ్లు
నీళ్లు – సరిపడా
ఆరంజ్ – 3
దాల్చిన చెక్క పొడి – 1/4 టీ స్పూన్
ఉప్పు చిటికెడు
పంచదార – జ్యూస్ కి సరిపడా
తయారు చేయు విధానం:
ముందుగా జీడీ మామిడి పండు, ఆరంజ్ ని వేరు వేరు గా జ్యూస్ చేసుకోవాలి. ఈ పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేతి తో స్క్విజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి జ్యూస్ జార్ తీసుకుని ముందుగా తయారు చేసుకున్న జ్యూస్ వేసి దాల్చిన చెక్క పొడి, ఉప్పు, పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి, ఇందులో కావాలనుకుంటే కాస్త నీళ్లు కూడా వేసి బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి. సెర్వింగ్ గ్లాస్సెస్ లో పోసి చల్ల చల్లని జీడిమామిడి ఆరంజ్ జ్యూస్(Juice) సర్వ్ చేయండి.
జీడీ మామిడి పాయసం
కావాల్సిన పదార్దాలు:
జీడిపప్పు – 10-15
బెల్లం – 1/2 కప్పు
కొబ్బరి – రుచికి సరిపడా
ఏలకులు – 2
జీడీపప్పు, ఎండుద్రాక్ష – సరిపడా
నెయ్యి – ఒక స్పూన్
తయారు చేయు విధానం:
జీడిపప్పును కడిగి నాలుగు – ఐదు ముక్కలుగా కోసి, ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన జీడిపప్పును మెత్తగా రుబ్బి అందులో బెల్లం వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పాన్ లో పోసి, చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో నెయ్యిలో వేయించిన కొబారి తురుము వేసి మరి కాసేపు ఉడికించాలి. ఈ పాయసంలో ఏలకులు, జీడీపప్పు, ఎండుద్రాక్షతో గార్నిష్ చేసుకుంటే జీడిమామిడి పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.