జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2021) రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15, మంగళవారంన ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ 2021 దరఖాస్తుల గడువు 2021 జనవరి 15, తో ముగియనుంది. JEE అధికారిక వెబ్‌సైట్ లో https://jeemain.nta.nic.in/ అభ్యర్థులు రిజిస్టర్ (Register) చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్, అర్హత , దరఖాస్తుల తేదికి సంబంధిచిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు సార్లు:
ఇప్పటివరకూ జేఈఈ పరీక్షను రెండుసార్లు నిర్వహించేవారు.2021లో నాలుగుసార్లు జేఈఈ మెయిన్స్ 2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
మొదటిసారి పరీక్షలో ఏదైనా పొరపాట్లు జరిగిన లేదా ఇతర పరీక్షల కారణంగా లేదా ఏ ఇతర కారణాల ద్వారా ఈ పరీక్ష రాయలేని వారికి మళ్ళీ రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలనే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి లేదా అన్ని పరీక్షలకు హాజరయ్యే ఆప్షన్ (option )ఎంచుకోవచ్చునని కేంద్రమంత్రి తెలిపారు.
ఎవరైనా అభ్యర్థి నాలుగు సార్లూ పరీక్షలకు హాజరైతే దేనిలో ఎక్కువ మార్కు లు వస్తే దానినే పరిగణనలోనికి తీసుకుంటామని ఎన్టీఏ పేర్కొంది.
ఫిబ్రవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main)షెడ్యూల్‌ను డిసెంబర్ 16, బుధవారం న విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పరీక్షలో కీలక మార్పులు చేశారు. ప్రశ్నపత్రాల్లో ఆప్షన్లను పెంచడంతోపాటు మాతృభాషలో రాసుకునే అవకాశం కల్పించారు. అలాగే నెగెటివ్ మార్కులను తొలగించారు.
జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు రోజుకు రెండు విడుతల్లో ఆన్‌లైన్(online)లో నిర్వహించనున్నారు. మార్చి, ఏప్రిల్, మేలో మరో మూడు విడుతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష
ఈసారి జేఈఈని ఇంగ్లీష్, హిందీతో పాటు మరో పదకొండు (11)ప్రాంతీయ భాషల్లోనూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఉర్దూ, పంజాబి, ఒడి యా, మరాఠి, బెంగాలి, గుజరాతి, అస్సామి భాషలలోనిర్వహిస్తారు. అభ్యర్థి పరీక్ష ఏ భాషలో రాయాలనుకుంటున్నారో ముందుగా దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి.తర్వాత మార్పులు చేసే అవకాశం ఉండదు. ఇంగ్లీష్, ఉర్దూ ,హిందీ, భాషలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షకు హాజరు కావచ్చు.
ప్రాంతీయ భాషలను ఎంపిక చేసుకున్నవారు అక్కడి రాష్ట్రంలోనే పరీక్ష రాయాలి. అంటే తెలుగులో రాయాలనుకునేవారు తెలంగాణ, ఏపీ కేంద్రాల్లోనే రాయాల్సి ఉంటుంది.
పరీక్షా విధానం
ప్రతి పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. పేపర్-1 బీఈ/బీటెక్‌లో సెక్షన్-1, 2లో మొత్తం 100 మార్కులుంటాయి. ఇందులో సెక్షన్-1లో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి . ఒక్కోదానికి 4 మార్కులుంటాయి.
తప్పుడు సమాధానానికి -1 మార్కు కోత ఉంటుంది. సెక్షన్-బిలో మాత్రం ఆప్షన్లను పెంచారు. 10 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో తప్పుడు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉండవు.
అలాగే బీ-ఆర్కిటెక్చర్‌లో పేపర్-2 ఏ లో రెండు సెక్షన్లలో మొత్తం 82 ప్రశ్నలకు 400 మార్కులు.
మరియు పేపర్-2బి బీప్లానింగ్ పరీక్షలో రెండు సెక్షన్లలో 105 ప్రశ్నలకు 400 మార్కులుంటాయి.
బీఆర్క్, బీ-ప్లానింగ్ పరీక్షల్లో పేపర్-1….
బీఈ/బీటెక్ విద్యార్థులకు ఉన్నట్టుగానే సెక్షన్-1లో కూడా ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, తప్పుడు సమాధానానికి -1(నెగెటివ్) మార్కులు ఉంటాయి.
సెక్షన్-2లో మాత్రం ఐచ్ఛికాలను పెంచి, నెగెటివ్ మార్కులను తొలగించారు.
పేపర్-1: బీఈ, బీటెక్ (BE,BTech) అభ్యర్థులకు సీబీటీ (కంప్యూటర్ ఆధారిత) పరీక్షా విధానంలో పరీక్ష ఉంటుంది.
పేపర్-2 ఏ: బీఆర్క్ మేథమెటిక్స్ (Mathematics) పార్ట్-1 మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ (Apptitude)పార్ట్-2 సీబీటీ విధానంలో ఉంటుంది.
పార్ట్-3 – డ్రాయింగ్ టెస్ట్ ఆఫ్‌లైన్ విధానంలో ఏ-4 సైజ్ డ్రాయింగ్ షీట్ ద్వారా పరీక్ష ఉంటుంది.
పేపర్-2బి : మేథమెటిక్స్ పార్ట్-1, ఆప్టిట్యూడ్(Apptitude test) టెస్ట్ (పేపర్-2), ప్రశ్నలు (పార్ట్-3) సీబీటీ విధానంలో ఉంటుంది.
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు (Application)స్వీకరణ ప్రారంభం : డిసెంబరు 16 నుంచి జనవరి 16 వరకు
దరఖాస్తు చేసిన తరువాత ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ (Last date to fees): జనవరి 17
మొదటి విడత పరీక్ష కు తేదీలు: ఫిబ్రవరి 23, 24, 25, 26
పరీక్ష సమయం : ఉదయం 9- 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3- 6 గంటల వరకు
రెండోవిడత పరీక్షకు తేదీలు : మార్చి 15, 16, 17, 18
మూడోవిడత పరీక్ష తేదీలు: ఏప్రిల్ 27, 28, 29, 30
నాలుగోవిడత పరీక్ష కు తేదీలు: మే 24, 25, 26, 27, 28
అభ్యర్థులు JEE పరీక్షకు దరఖాస్తు చేసుకుని సక్సెస్ పొందుతారని ఆశిస్తూ విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ జెఈఈ కాండిడేట్స్ (Wish you all the best).