https://youtu.be/kU_bXiR0I2k
ఏ ఉత్పత్తి మార్కెట్లో అమ్ముడుపోవాలన్నా దానికి ప్రచారం తప్పనిసరి. ఇలా ప్రచార మాధ్యమం విలువ ఏ దేశంలో చూసినా కొన్ని వందల కోట్లు. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం భారీగా వెచ్చిస్తుంటాయి. ఇప్పటికే మనం పెద్ద పెద్ద క్రీడా మైదానాల్లోనూ, ప్రభుత్వ, ప్రైవేటు ఈవెంట్లలోను ఉత్పత్తులు కావచ్చు లేదా ఆ కార్యక్రమాన్ని గూర్చి వినూత్నంగా ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా జపాన్ కు చెందిన NTT DOCOMO సంస్థ ఒక Spherical Display Drone ను తయారు చేసింది.
పేరే వింతగా ఉంది కదూ. కానీ ఈ డ్రోన్ ను తయారు చేయడం అంత సులభం కాలేదు అని చెప్పింది NTT సంస్థ. ఎందుకో ముందు ముందు తెలుస్తుంది. ఇక ఈ డ్రోన్ ఎలా తయారు చేయబడిందో చూద్దాం. ఈ డ్రోన్ చుట్టూ వంపు తిరిగిన LED స్ట్రిప్స్ ఉన్నాయి (curved LED strips). ఈ డ్రోన్ ఆకాశం లో ఎగిరేసరికి ఆ LED స్ట్రిప్స్ వేగంగా కదులుతూ ఒక డిస్ప్లే స్క్రీన్ లాగా భ్రమింపచేస్తుంది. ఈ LED స్ట్రిప్స్ లోపల డ్రోన్ రోటార్లు ఉన్నాయి. అవి గాల్లోకి ఎగరాలంటే ఈ డ్రోన్ ప్రోపెల్లెర్ కు ఈ LED స్ట్రిప్స్ అడ్డుగా మారాయి. అందువల్ల ఈ డ్రోన్ తయారు చేయడం కష్టం అయింది. కానీ ఈ LED స్ట్రిప్లను అత్యంత తేలికైన, సన్నని పొరలా ఉండే విధంగా తయారు చేసారు. దానితో డ్రోన్ గాల్లోకి ఎగరడం సాధ్య పడింది. ఈ డ్రోన్ ఎలా ఎగురుతుందో ఇక్కడ వీడియో లో చూడవచ్చు.
ఇక ఈ డ్రోన్ చుట్టూ ఉన్న డిస్ప్లే 88 సెంటీమీటర్ల (diameter) తో, 144×136 పిక్సెల్స్ తో తయారు చేయబడింది. ఇక ఈ డ్రోన్ మొత్తం బరువు 3.4 కేజీలు. ఈ డ్రోన్ వాణిజ్య పరంగా మార్చ్ 2019 కల్లా అందుబాటులోకి వస్తుంది.
ఇంత తేలికైన అధునాతనమైన ఈ డ్రోన్ ను పెద్ద పెద్ద ఈవెంట్లలో, ఎయిర్పోర్ట్ లలో ఉపయోగించవచ్చు. సంప్రదాయ హోర్డింగ్లు మరో పద్ధతుల కంటే ఇది ఖచ్చితంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు కదూ.