కొత్త సంవత్సరం(New year) ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే వుంది. ఏడాది ప్రారంభ నెల అయిన జనవరి(January) అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు.
ఇదే నెలలోనే రిపబ్లిక్ డే(Republic day) సైతం ఉంటుంది. దీంతో ఈ నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు వస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నెల ప్రారంభంలోనే జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు ఉంటుంది. అయితే.. సాధారణ సెలవుల్లో జనవరి 1ని కూడా ప్రభుత్వం(Government) పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే అవకాశం మిస్ అయ్యింది.
ఈ సారి భోగి(Bhogi) పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ రోజు రెండో శనివారం.దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.
భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతి(Sankranthi) కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో సెలవు రోజును మిస్ అయ్యినట్టే. జనవరి 16న సోమవారం కనుమ(Kanuma) పండుగకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే(Optional Holiday)ను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థల(Educational Institution)కు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది.
ఇక రిపబ్లిక్ డే(Republic Day) జనవరి 26న గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల(Private Office)తో పాటు విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆ రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది.
ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకుల(Bank)కు ఆ రోజు సెలవు ఉంటుంది. మొత్తం మీద జనవరిలో పండుగలు(Festivals) ఎక్కువగా ఉన్న, అవి ఆది, రెండో శనివారం నాడు రావడంతో సెలవులు మాత్రం తక్కువగానే వచ్చాయి.