ప్రముఖ ఇస్రో (ISRO) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఉద్యోగాల (Central Government Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
టెక్నీషియన్-ఎ(Technician-A), డ్రాట్స్‌మన్-బి(Draftsman-B), రేడియోగ్రాఫర్-ఎ(Radiographer-A) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో(Notifications) పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఈ రోజు అంటే మే 4(May 4th) న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 18ని ఆఖరి తేదీ(Last Date)గా నిర్ణయించారు. అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు(Candidates) ISRO అధికారిక వెబ్‌సైట్(Official Website) vssc.gov.in లేదాisro.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు : 49
టెక్నీషియన్-ఆ 43
డ్రాఫ్ట్స్‌మన్-బి 5
రేడియోగ్రాఫర్ 1
విద్యార్హతలు:
అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ల. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల(Full Details)ను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు రుసుము :
UR/OBC అభ్యర్థులకు దరఖాస్తు: రూ.100/-
SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు- నిల్
వేతనం:
- టెక్నీషియన్-బి- లెవెల్ 03 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 21700-రూ. 69100
- డ్రాఫ్ట్స్‌మన్-బి- లెవెల్ 03 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 21700-రూ. 69100
- రేడియోగ్రాఫర్-ఎ- లెవెల్ 04 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25500-రూ. 81100
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు(Online Application) ప్రారంభం – మే 4
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – మే 18