కొన్ని శతాబ్దాల నుండి మన ఆహారాల్లో ఖర్జూరాలు(Dates) ఒక భాగం అయ్యాయి. ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఫ్యాట్, క్యాల్షియం, ఐరన్, సోడియం , విటమిన్ సి మరియు విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు, కరిగే పీచు మరియు కరగని పీచు అధికంగా ఉన్నాయి. ఇంకా డ్రైఫ్రూట్స్(Dry Fruits) తో పోల్చితే వీటిలో క్యాలరీలు అధికంగా ఉన్నాయి.
అందుకే ఖర్జూరాలు ఎక్కువగా తినదగిన పండ్ల జాబితాలో చేరిపోయాయి. వీటిలో ఉండే హై క్వాలీటీ పోషకాల(Quality Nutrients) వల్ల అత్యుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాల్లో ఎక్కువ క్యాలరీలు(High Calories) మరియు చెక్కరలు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ వారు వీటిని తినకూడదనే అపోహ ఒకటి ఉంది, ఇవే కాకుండా ఖర్జూరాలు డ్రైఫ్రూట్స్ లిస్ట్ లో ఉన్నాయి.
అంటే తాజా పండ్ల కంటే ఎండు ఫలాల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. మరి డయాబెటిస్(Diabetes) వారు ఖర్జూరాలను తినవచ్చో తినకూడదో ఇక్కడ చూద్దాం!
ఒక పరిశోధన ప్రకారం ఖర్జూరాల్లో గ్లిజమిక్ ఇండెక్స్(Glycemic index) ఉండటం వల్ల డయాబెటిస్ వారు వీటిని తినడం వల్ల గ్లైసిమిక్ మరియు లిపిడ్(Lipid) కంట్రోల్ అవుతుందని కనుగొన్నారు.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రీషియన్ అనే మరో పరిశోధన ప్రకారం కలాస్ డేట్స్ ను తిన్నప్పుడు లేదా లో గ్లైసిమిక్ ఉన్న ప్లెయిన్ పెరుగుతో కలిపి తిన్నప్పుడు, డయాబెటిక్ వారిలో గ్లైసిమిక్ మరియు లిపిడ్ కంట్రోల్ అవుతుందని నిర్ధారించారు.
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్(Anti Oxidant), యాంటీ ఇన్ఫ్లమేటరీ(Anti Inflammatory) లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్(Cancer) వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది. అందుకే ఆహారం తిన్న తర్వాత స్వీట్ డిష్ లేదా ఐస్ క్రీంకు బదులుగా ఖర్జూరం తినాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు సులభంగా తగ్గుతాయి.
ఖర్జూరంలో ఎముకలను దృఢం(Strong Bones)గా చేసే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం (Magnesium) పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎముల సమస్యలతో ఉన్నవారు తీసుకుంటే చాలా ఎముకలు దృఢంగా మారుతాయి.
అంతేకాకుండా ఎముకలను బలోపేతమవుతాయి. షుగర్ లెవల్స్(Sugar Levels) అదుపులో ఉండాలంటే తప్పకుండా ఆహారాల్లో వీటిని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు(Health Experts) తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అయితే రోజుకు 3 ఖర్జూరాలను తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. డయాబెటిస్ వారు రోజుకు 2-3 వరకు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యకరమై ఆహారపు అలవాట్లును కలిగి ఉంటారు. ఖర్జూరలో పొటాషియం(Potassium) ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి.
కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు(High Bp) సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు(Heart Problems) కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.