ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(Irritable Bowel Syndrome), పెద్ద ప్రేగు(Large intestine)ల్లో అసాధారణ కదిలికల కారణమని వైద్య నిపుణులు(Medical Expert) పేర్కొంటున్నారు ఈ సమస్య పట్ల అవగాహనా(Awareness) లేని కారణంగా పలువురు ఎంతో భయానికి లోనవుతుంటారు.
అందుకని దీనికి సంబంధించిన వాస్తవాలు(Related Facts), అవాస్తవాలు ఏంటో తెలుసుకుందాం!
జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్య(Digestive Related Health Issues)ల్లో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(IBS) ప్రధానమైనది. సాధారణ భాషలో దీన్ని కడుపులో గడబిడ అని చెప్పవచ్చు. ఇది ప్రేగుల పని తీరులో వచ్చిన మార్పు వలన కలిగే సమస్యే తప్ప నిర్మాణిత సమస్య కాదు.
ఇది కేవలం సమస్య లక్షణమే తప్ప సమస్య కాదు. ఈ సమస్య వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా, రోజు వారి దినచర్యను తీవ్రంగా ప్రభావితం(Influence) చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకుండా విసర్జన కావడంతో శరీరానికి అందాల్సిన పోషకాలు(Nutrients) అందక మనిషి బలహీన(Weakness) పడిపోయి రోగ నిరోధక శక్తి(Immunity Power) తగ్గి అనారోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కడుపు ఉబ్బరం(Bloating), కడుపులో గడబిడ శబ్దాలు(Stomach Cramps), త్రేన్పులు(Belching) తరచూ వచ్చే అపాన వాయువు, మల్లి మల్లి టాయిలెట్(Toilet) కు వెళ్లాల్సిరావడం.వంటి లక్షణాలు కనిపిస్తూ వుంటాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య పురుషుల్లో(Men) కాన ఎక్కువగా మహిళల్లో(Women) కనిపిస్తుంది. అయితే అతి తక్కువ మంది మాత్రమే చికిత్స(Treatment) పొందడానికి మాత్రమే హాస్పిటల్ కి వెళ్ళతారు.
ఈ సమస్య తీవ్రమైన సందర్భాలలో పెద్ద ప్రేగు చివరలో గాయం(Wound) ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మన శరీరానికి పడని వస్తువులు తినడం వలన, తిన్న వస్తువు కల్తీ కావడం వలన, ఫుడ్ పాయిజనింగ్ వలన ఐబిఎస్ సమస్య వస్తుంది. దీనికి సాల్మొనెల్లా బాక్టీరియా (Salmonella Bacteria)కారణం కావచ్చు.
ఎప్పుడు చిరకాకు(Irritation)గా ఉండడం, వికారంగా ఉండడం, వాంతులు(Vomiting) వంటి భావన కలుగుతుంది. ఈ వ్యాధి నిర్దారణకు ఎలాంటి పరీక్షలు(Test) చేయించుకోవాలి అని వైద్యులు చెప్పకుండా రక్త పరీక్షతో ఏవైనా బాక్టీరియా చేరిందని విషయాన్ని తెలుసుకుంటారు.
టాయిలెట్ కు వెళ్లడాన్ని బట్టి ఈ సమస్య నాలుగు రకాలుగా ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. ఆహారంలో పీచు లోపించడం(Lack of Nutrients), కొవ్వు(Fat) అతిగా వుండే ఆహారం అతిగా తినడం వల్ల ఇరిటల్ బవెల్ సిండ్రోమ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి.
ఐబిఎస్ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే ముందుగా టీ(Tea), కాఫీలు(Coffee) మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాదు ఆహార పదార్దాలలో ఎక్కువ మసాలాలు(Masala), అతి కారం(Species)గా వుండే పదార్దాలు లేకుండా చూసుకోవాలి. తినే ఆహార పదార్దాల ద్వారా ఇన్ఫెక్షన్లు(Infections) సోక కుండా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం మానేయాలి.
పాలు, పల పదార్దాలు తక్కువ గా తీసుకోవాలి.టాయిలెట్ వెళ్లిన ప్రతి సారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు(Fruits), పీచు పదార్దాలు(Fiber), అధికంగా నీళ్లు(Excess of Water) తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(IBS) సమస్య బారిన పడకుండా ఉండవచ్చు