భారతీయ రైల్వేలో ఉద్యోగాల (Indian Railway) భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజయ్యింది. ఈస్టర్న రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) అప్రెంటీస్ పోస్టుల(Apprentice Posts) భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల(Release) చేసింది.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3115 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈస్టర్న్ రైల్వే(Eastern Railways). వేర్వేరు రైల్వే డివిజన్లలో ఈ పోస్టులున్నాయి. ఏడు డివిజన్లు(7 Divisions), వర్క్ షాప్స్(Workshops) లో ఫిట్టర్(Fitter), వెల్డర్(Welder), కార్పెంటర్(Carpenter), పెయింటర్(Painter) లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ(Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 చివరి తేదీ(Last Date). అభ్యర్థులు ఆన్లైన్(Online)లోనే దరఖాస్తు చేయాలి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.
ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు(Full details), విద్యార్హతలు(Education Qualifications), దరఖాస్తు విధానం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు – 3115
హౌరా డివిజన్ – 659
లిలువా వర్క్‌షాప్ – 612
సీల్దాహ్ డివిజన్ – 440
కంచ్రపార వర్క్‌షాప్ – 187
మాల్దా డివిజన్ – 138
అసన్సోల్ వర్క్‌షాప్ – 412
జమాల్పూర్ వర్క్‌షాప్ – 667
పూర్తి సమాచారం:
- నోటిఫికేషన్ విడుదల- 2022 సెప్టెంబర్ 23
- దరఖాస్తు ప్రారంభం- 2022 సెప్టెంబర్ 30
- దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 29
- మెరిట్ లిస్ట్ విడుదల- 2022 డిసెంబర్
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్(Trade)లో ఐటీఐ పాస్(ITI Pass) కావాలి.
- వయస్సు- 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు.
- ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్(Merit List) ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు ఫీజు- రూ. ఎస్సీ(SC), ఎస్టీ(ST), మహిళలు(Women), దివ్యాంగుల(Handicapped)కు ఫీజు లేదు(No fee).