మన శరీరాన్ని ఎముకల గూడు అంటారు.ఈ ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం (Calcium) తప్పనిసరి.మన శరీరంలో 99 శాతం కాల్షియం ఉంటుంది.అది దంతాలు మరియు ఎముకల రూపంలో గట్టి కనిజాలంలాగా ఉంటుంది.

ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు భాదపడుతున్న ఆరోగ్య సమస్య కాల్షియం లోపించడం లేదా తక్కువగా ఉండడటం .అది మహిళలలో ఎక్కువగా చూస్తున్నాం….

 కాల్షియం వల్ల ప్రయోజనాలు

మన శరీరంలో ప్రతి అవయవానికి కాల్షియం సరిగ్గా ఉంటేనే ఎముకలు, దంతాలు, గుండె ఇలా అన్ని అవయవాలు దృఢంగా ఉంటాయి.అంతేకాకుండా నరాల ద్వారా సందేశాన్ని అన్ని అవయవాలకు పంపడానికి కాల్షియం ముఖ్యపాత్ర  వహిస్తుంది.

రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి మరియు కండరాలు,ఎముకలు సంకోచం,వ్యాకోచంకి అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు  రాకుండా నివారిస్తుంది.

 కాల్షియం లోపించడం వల్ల మహిళలు ఎదుర్కునే సమస్యలు

సాధారణంగా 20 సవంత్సరాలు లోపు పిల్లలకి 600mg,కాల్షియం 20 సవంత్సరాలు దాటినవారికి 450mg – 500mg  కాల్షియం ప్రతిరోజు అవసరం ఉంటుంది.

muscles pains

అదే మహిళలలో ఐతే 18 నుండి 50 సవంత్సరాలు లోపు ఉన్న  మహిళలకు వారి శరీరంలో కాల్షియం ప్రతిరోజు 1,000 నుండి 1,200 mg అవసరం ఉంటుంది.

మరియు  50 సవంత్సరాలు దాటినా పెద్దవారికీ 1200mg  -1400mg కాల్షియం అవసరం ఉంటుంది.గర్భిణీ స్త్రీలకి 900mg కాల్షియం అవసరం.  దీని కన్నా తక్కువ మోతాదులో కాల్షియం ఉంటే గనుక అది కాల్షియం లోపం అవుతుంది.

మహిళల్లో కాల్షియం లోప లక్షణాలు సరిగ్గా తెలుసుకోలేము.ఒకవేళ  మహిళల్లో కాల్షియం లోపం లక్షణాలు తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చేసి వాటి స్థాయి ఎంతో తెలుసుకోవచ్చు.

వృద్ధ మహిళలో ఈ కాల్షియం లోపించి సమస్య ఎక్కువగా చూస్తుంటాము.విటమిన్ డి మన శరీరంలో సరిపడా ఉంటేనే కాల్షియం ఉంటుంది,లేదంటే కాల్షియమ్ లోపం వస్తుంది.

కొన్ని లక్షణాలని బట్టి కాల్షియమ్ లోపించినట్టు గుర్తుపట్టవచ్చు.

1 .కండరాల నొప్పులు,కాళ్లు చేతులు కొంగర్లు పోవడం.

2.ముఖం,కాళ్లు ,చేతులు మొద్దుబారడం.

3  గోళ్లు విరిగిపోవడం లేదా పగిలిపోవడం కానీ జరుగుతాయి.

4 .ఎదిగే పిల్లలకి ఎముకలు బలహిహం అయిపోయి ఎదుగుదల తగ్గుతుంది.కాల్షియం లోపించడాన్ని హైపోకాల్సిమియా అని కూడా అంటారు.తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే (ఆస్టాపీనియ) ఎముకలు సన్నబడిపోయే వ్యాధి సంక్రమిస్తుంది.

అంతేకాకుండా  పిల్లలలో బలహీనమైన ఎముకలు, (Weak bones )ఎముకలు బరువు తగ్గడం.దీన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు.కాల్షియం లోపం తగ్గాలంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

5 .మహిళల్లో కాల్షియం లోపించడం వల్ల కలిగే  లక్షణాలలో ఒకటి తిమ్మెర్లు మరియు కండరాల నొప్పులు

6 .జుట్టు రాలిపోవడం (Hair loss )మరియు నిర్జీవంగా మారిపోవడం.

7 .మానసిక సంభందమైన సమస్యలు మరియ జ్ఞాపకశక్తి తగ్గడం,కన్ఫ్యూషన్ అవడం.

Depression

8 .డిప్రషన్ (Depression) లక్షణాలుఎక్కువగా కనబడుతుంటాయి.

9 ఊహలు,పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువ అవడం.

10 మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం.

వీటి అన్నిటికి ప్రధాన కారణం విటమిన్ లోపించడం..దానికి మంచి పరిష్కారం ,ఉదయాన్నే సూర్యరశ్మి లో ఉంది ఎముకల ధృడత్వాన్నీ పెంచుకోవడం.

సంవత్సరానికి ఒక్కసారైనా విటమిన్ డి (Vitamin-D) ,కాల్షియం మరియు బోన్ డెన్సీటీ ఎలా ఉంది ఎలాంటి పరీక్షలు చేసుకోవడం మంచిది. అధిక కాల్షియం ఉన్న పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నయం చేసుకోవచ్చు.

కాల్షియం అధికంగా ఉంటే కలిగే నష్టాలు

రక్తంలో కాల్షియం తక్కువగా  ఉన్న సమస్యే అదే ఎక్కువగా ఉన్న సమస్యే.అదే ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళూ ఏర్పడటం మరియు ఎముకలు బలహీనపడటం ,గుండె,మెదడు పనితీరు దెబ్బతింటుంది.థైరాయిడ్ గ్రంధులు సమీపంలో ఉండే నాలుగు చిన్నపాటి పారా గ్రంధులు అతిగా పనిచేయడం వల్ల అధిక కాల్షియం సమస్య వస్తుంది.

కాల్షియం అధికంగా ఉన్న వారు మార్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు

మూత్రపిండాలకు పని పెరిగి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మన శరీరంలో కాల్షియం అధికంగా ఉంటే  వికారం,కడుపు నొప్పి,మలబద్దకం,తరచూ దాహం వేయడం,వాంతులు అవ్వడం.దాని లక్షణాల ఈ విధంగా ఉంటాయి.

కూల్ డ్రింక్స్, మాంసాహారం అధికంగా తినడం,స్పైసీ ఫుడ్,ఉప్పు ఎక్కువగా తినడం వలన కూడా కాల్షియం ఎక్కువైతుంది.

ఏదైనా సరే మన శరీరానికి పోషకాలు సరిపడినంత మాత్రమే ఉండేలా చూసుకోవాలి.అవి ఎక్కువైనా తక్కువైనా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాల్షియం లోపానికి చాలా మంది మందులు వాడుతుంటారు. మందులు వాడటంకంటే కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

మహిళలలో హార్మోన్స్ ప్రభావం వాళ్ళ కూడా కాల్షియం తగ్గే అవకాశం ఉంటుంది. 

పెద్ద వయస్సు ఉన్న వారు  కాల్షియం మందులు ఎక్కువగా వాడుతుంటారు.వారికీ మూత్రపిండాలతో పాటు మెదలులో రక్తనాళాలు పాడైపోతుంది. మందులు తప్పురిసారి అయితే డాక్టరుని సంప్రదించి వారి సలహా మేరకు వాడాలి.

మరి ఎలా అనుకుంటున్నారా ??

కాల్షియం అధికంగా ఉన్న ఆహార పధార్ధాలు తీసుకుని ఈ సమస్య నుండి దూరం గా ఉండవచ్చు . 

మన ఆహారంలో అధిక కాల్షియం ఉన్న పధార్ధాలు తీసుకోవడం వల్ల కాల్షియం లోపం తగ్గుతుంది.

ఉదాహరణకు.. పాలు,పెరుగు,పనీర్ ,పాలకూర,బచ్చలికూర,బ్రోకలీ,పప్పు ధాన్యాలు,బీన్స్,బఠాణి,గుడ్లు,నట్స్, నువ్వులు,వెన్న ,వేరుశెనగ పొనగంటి కూర,మునగాకు మరియు మినరల్ వాటర్లలో కాల్షియం అధికంగా ఉంటుంది.

చూసారు కదా కాల్షియం అనేది మనిషి శరీరానికి ఎంత అవసరమో , కాల్షియం పుష్కలం గా ఉన్న ఆహారాన్ని తీసుకుని జీవితం లో ఆరోగ్యం గా ,ఆనందంగా ఉండండి .