ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీస్(Management Trainees) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఐబిపీఎస్ నియామక డ్రైవ్ వివిధ విభాగాలలో 4,135 ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీల కోసం నియామక ప్రక్రియ నోటిఫికేషన్ ను అక్టోబర్ 19న విడుదల చేసారు.
ఈ పోస్టులకు అక్టోబర్ 20న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఐబిపీఎస్ అధికారిక వెబ్సైట్(Official Website)లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము మరియు ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపుకు చివరి తేదీ కూడా నవంబర్ 10, 2021 అని గమనించవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్(IBPS) ఈ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది.
విద్య అర్హతలు మరియు ఫీజులు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University) నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(Graduation) డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా అక్టోబర్ 2, 1991 కంటే ముందు జన్మించి ఉండాలి.
జనరల్, క్యాటగిరి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ .850/- చెల్లించాలి. ఎస్సి, ఎస్టి, మరియు ఇతర వర్గానికి చెందిన వారు దరఖాస్తు రుసుముగా రూ .175/- చెల్లించాలి. చెల్లింపు ఆన్లైన్ మోడ్(Online Mode) ద్వారా చేయాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
- మొదట ఐబీపీఎస్(IBPS) అధికారిక వెబ్సైట్లో https://www.ibps.in/crp-po-mt-xi/ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.
- తరువాత ఆన్లైన్ రిక్రూట్మెంట్(Online Recruitment) లింక్ పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఆరు దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మొదటి దశలో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
- రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
- మూడో దశలో ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
- నాలుగో దశలో అప్లికేషన్ వివరాలన్నీ సరిచూసుకోవాలి.
- ఐదో దశలో ఎడమ చేతి వేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి.
- ఆరో దశలో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
మరి ఇక ఆలస్యం ఎందుకు ?? ఈరోజే అప్లై చేసేయండి …ఆల్ ది బెస్ట్ …..