నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మెట్రో రైల్‌లో (Hyderabad Metro Rail) పలు ఖాళీలు ఉన్నాయి. ఏఎంఎస్ ఆఫీసర్(AMS Officer), సిగ్నలింగ్ టీమ్(Signal Team), రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్(Rolling Stock Team Leader), ట్రాక్స్ టీమ్ లీడర్(Tracks Team Leader), ఐటీ ఆఫీసర్(IT Officer) లాంటి పోస్టులున్నాయి. మొత్తం 12 ఖాళీలుఉన్నాయి. విద్యార్హతల(Educational Qualification)తో పాటు అనుభవం(Experience) ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఆసక్తి(Interested)గల అభ్యర్థులు(Candidates) మెయిల్(Mail) ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు(Post details), విద్యార్హతలు, దరఖాస్తు విధానం(Application Process), నోటిఫికేషన్ వివరాలు(Notification Details) తెలుసుకోండి.
ఖాళీల వివరాలివే:
మొత్తం ఖాళీలు 12
ఏఎంఎస్ ఆఫీసర్ 1
సిగ్నలింగ్ టీమ్ 2
రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ 6
ట్రాక్స్ టీమ్ లీడర్ 2
ఐటీ ఆఫీసర్ 1
విద్యార్హతలు
- ఏఎంఎస్ ఆఫీసర్- ఇంజనీరింగ్(Engineering) గ్రాడ్యుయేషన్(Graduation) పాస్ కావాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్(AMS) లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
- సిగ్నలింగ్ టీమ్- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా(Diploma), గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
- రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- మెకానికల్(Mechanical), ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
- ట్రాక్స్ టీమ్ లీడర్- సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
- ఐటీ ఆఫీసర్- బీటెక్(B.Tech), ఎంసీఏ(MCA), ఎంఎస్‌సీ(MSC) పాస్ కావాలి.1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకోండి ఇలా
- ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో Careers సెక్షన్ ఓపెన్ చేయాలి
- Current Opportunities పైన క్లిక్ చేయాలి.
- విద్యార్హతల వివరాలన్నీ పూర్తిగా చదవాలి.
- దరఖాస్తు ఫామ్ ప్రిపేర్ చేసి [email protected] మెయిల్ ఐడీ(Mail ID)కి పంపాలి.