ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ని చూడండి…..

 

హలో ఫ్రెండ్స్, హెచ్  పి  సంస్థ వారు 2018-2019 పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థుల కోసం హెచ్ పి ఉదాన్ స్కాలర్షిప్ ను అందిస్తున్నారు. ఇండియా నుంచి ఏ స్టేట్ వారైన ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు . అంతేకాదు అమ్మాయిలకి  50%స్కాలర్షిప్స్ ప్రేత్యేకంగా కేటాయించబడ్డాయి. ఈ స్కాలర్షిప్ ని 3 రకాలుగా విభజించారు

1 year scholarship – ఎవరైతే ఒక సంవత్సరం పాటు డిప్లొమా చేయాలనుకుంటారో వారి కోసం

2 year scholarship – ఎవరైతే రెండు సంవత్సరాలు ఇంర్మీడియేట్ లేదా డిప్లొమా  చేయాలనుకుంటారో వారి కోసం

3 year scholarship – ఎవరైతే మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్స్ చేయాలనుకుంటారో వారి కోసం

ఈ స్కాలర్షిప్ మొత్తం 750 మందికి ఇవ్వబడుతుంది.

1 ఇయర్ స్కాలర్షిప్ – 275 – ఒక సంవత్సరానికి 20000

2 ఇయర్ స్కాలర్షిప్ – 250 – ఒక సంవత్సరానికి 20000

3 ఇయర్ స్కాలర్షిప్ – 225 – ఒక సంవత్సరానికి 30000

అర్హత వివరాలు :

  • ఈ  స్కాలర్షిప్ పొందాలనుకునేవారు ముందుగానే మీరు చదవాలనుకునే కోర్స్ లో ఎన్రోల్ చేసుకొని ఉండాలి.
  • మీ పదవతరగతి లో 60% మార్కులతో ఉత్తీర్ణులయి ఉండాలి.
  • పన్నెండవ తరగతి (ఎవరైతే 3 సంవత్సరాల స్కాలర్షిప్ కి అప్లై చేయదలచిన వారు) లో 60% మార్కులతో ఉత్తీర్ణులయి ఉండాలి.
  • మీ కుటుంబ ఆదాయం ఒక సంవత్సరానికి 4 లక్షలకి మించి ఉండకూడదు.
  • ఇండియా లో ఏ స్టేట్  లేదా  ప్రాంతం వారైన అప్లై చేయొచ్చు.

ముఖ్యమైన తేదీలు:

స్కాలర్షిప్ మొదలు : 26 జనవరి,2019

స్కాలర్షిప్ చివరి తేదీ :26 ఫిబ్రవరి, 2019

ఎంపిక పద్ధతి :

మొదటి పద్ధతి (స్క్రీనింగ్ ) -27 ఫిబ్రవరి, 2019 నుంచి 10 మార్చి, 2019

రెండవ పద్ధతి (టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ) – 11 మార్చి , 2019 నుంచి 25 మార్చి, 2019

స్కాలర్ అనౌన్స్మెంట్ : 25 మార్చి, 2019 నుంచి 31 మార్చి, 2019

అవసరమైన పత్రాలు : (Doccuments required ):

  • మీ పాస్పోర్ట్ సైజు ఫోటో
  • ఇండియా గవర్నమెంట్ చేత ఇవ్వబడిన ID ప్రూఫ్ (ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు etc ..)
  • మీ  కుటుంబ ఆదాయపు సర్టిఫికెట్ (Income proof)
  • పడవ తరగతి మార్క్స్ షీట్ ( 10th marks sheet )
  • పన్నెండవ తరగతి మార్క్స్ షీట్ ( 12th marks sheet ) (ఎవరైతే 3 ఇయర్ స్కాలర్షిప్ చేసుకోవాలనుకుంటారో )
  • ప్రస్తుతం చదివే స్కూల్ లేదా కాలేజీ యొక్క ID లేదా  బోనాఫైడ్ సర్టిఫికెట్.

ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయాలనుకునే వాళ్ళు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు లోకి వెళ్లి మీయొక్క facebook  లేదా gmail లేదా google plus ద్వారా లాగిన్ అవ్వాలి.

click here

https://www.hpindiacsr.com/scholarships

లాగిన్ అయిన తరువాత స్టార్ట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అది పూర్తి చేసి submit బటన్ ని ప్రెస్ చేస్తే సరిపోతుంది.

– All The Best Friends