ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్(Photo Shaing App), ఇన్స్టాగ్రామ్(Instagram), తమ ప్లాట్‌ఫాంపై రోజు రోజుకూ సరికొత్త ఫీచర్ల ను యాడ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మొబైల్ యాప్(Mobile App) మరియు డెస్క్‌టాప్ వెర్షన్(Desktop Version) రెండింటిలోనూ తన వినియోగదారుల అనుభవాన్ని స్థిరంగా మెరుగుపరుస్తుంది.
అదే సమయంలో ఇన్‌స్టా తమ యూజర్ల ఖాతాల భద్రతకు కూడా జాగ్రత్తలు చేపడుతోంది. అనేక జాగ్రత్తలు ఉన్నప్పటికీ, మనం తరచుగా Instagram ఖాతా హ్యాక్‌ల గురించి వింటుంటాము. ఇన్స్టాగ్రామ్ Instagram తన ప్లాట్‌ఫారమ్‌లో అనుమానాస్పద చర్యల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆయా యూజర్(User) ఖాతాకు అనుమానాస్పద చర్యలపై నోటిఫికేషన్ పంపుతుంది.
మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి మరియు హ్యాకర్లను దూరంగా ఉంచడానికి మీరు కొన్ని పద్దతులను పాటించవచ్చు. మీ ఖాతాను ఎవరైనా నియంత్రణ(Control)లోకి తీసుకున్నట్లయితే, మీరు కంగారు పడాల్సిన పని లేదు. దాన్ని మీరు మళ్లీ సులవుగా మీ చేతిలోకి తీసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన పనుల్ని తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి.
మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్(Hack) చేయబడిందని మీకు ఎలా తెలుస్తుంది? మీరు మీ ఖాతాను ఉపయోగించి కొత్త పోస్ట్‌లను అప్లోడ్ చేయడానికి మీకు సాధ్యం కాకపోతే, మీ ఖాతా హ్యాక్ అయిందని గమనించాలి. అది కాకుండా, మీ ఖాతా నుంచి మీకు తెలియకుండా మీ మిత్రులకు పోస్టులు వెళ్లడం కానీ, మీ అనుమతి లేకుండా మీ ఖాతాలో కొత్త పోస్టులు వచ్చినట్లు గాని మీ దృష్టికి వచ్చినా కూడా మీ ఖాతా హ్యాక్ అయిందని గుర్తించాలి. మీ ఖాతాల్లో ఏదైనా జరిగే అనుమానాస్పద కార్యకలాపాల గురించి Instagram మీకు తన భద్రతా ఖాతా (security.mail@Instagram) నుండి యూజర్‌కు ఇమెయిల్ పంపుతుంది. అయితే, మీరు మీ ఖాతా హ్యాక్ అయింది అని భావించినపుడు ఇన్‌స్టా నుంచి కొత్త లాగిన్ లింక్ అభ్యర్థించడం ద్వారా మళ్లీ దాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్స్టాగ్రామ్ నుంచి కొత్త లాగిన్ లింక్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి:
- ముందుగా Instagram లాగిన్ పేజీ(Login Page)ని ఓపెన్ చేయాలి.
- Forgot Password లేదా గెట్ హెల్ప్ లాగింగ్-ఇన్ ఆప్షన్ పై నొక్కాలి.
- అనంతరం, మీరు మీ ఖాతాను రిజిస్టర్(Register) చేసుకున్న ఇమెయిల్ లేదా మొబైల్ నంబర్ చిరునామా వివరాలను అక్కడ పేర్కొన్న బాక్సులో ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు వివరాలు గుర్తులేకపోతే ‘మీ పాస్‌వర్డ్‌ని రీసెట్(Password Reset) చేయడం సాధ్యం కాదు అనే విషయాన్ని గమనించాలి.
- మీ మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద ఉన్న సెండ్ లాగిన్ లింక్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.ఇప్పుడు, మీ ఇమెయిల్(Email) లేదా మొబైల్‌కు కొత్త లాగిన్ లింక్ వస్తుంది.
- ఇప్పుడు మీకు వచ్చిన ఆ కొత్త లాగిన్ లింక్ పై నొక్కాలి.ఆ తర్వాత మీకు కొత్త పాస్ వర్డ్ క్రియేట్(Password Create) చేసుకోవాలని కోరుతూ ఓ పేజీ వస్తుంది. అందులో మీరు కొత్త పాస్వర్డ్ ఎంటర్ ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్(Submit Button)పై క్లిక్ చేయాలి. తద్వారా పాస్వర్డ్ చేంజ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- ఇలా పాస్వర్డ్ చేంజ్ ప్రక్రియ విజయవంతమైన తర్వాత మీ ఖాతా మీ నియంత్రణలోకి వచ్చిందని నిర్దారించుకోవచ్చు.
అదేవిధంగా, Instagram రీల్‌ను Facebookలో ఎలా క్రాస్-పోస్ట్ ఎలాచేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
- ముందుగా మీ మొబైల్ లేదా ట్యాబ్‌లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
- రీల్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించాలి.
- * రీల్ రికార్డింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కాలి.
- ఇప్పుడు మీకు “షేర్ ఆన్ ఫేస్బుక్” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు ఏదైతే ఫేస్బుక్ అకౌంట్లో రీల్ ను షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్బుక్ ఐడీని ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత షేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ రీల్ ఫేస్బుక్లో షేర్ విజయవంతం అవుతుంది.