ప్రస్తుత పాండమిక్ లో ప్రతీ వొక్కరి ఇంట వర్క్ ఫ్రొం హోం (Work from home)చేస్తున్నారు . పిల్లలకి కూడా ఆన్లైన్ క్లాస్ లు (Online classes) కదా . జూమ్ మీటింగ్స్,వీడియో కాన్ఫరెన్స్ కాల్స్,వర్చ్యువల్ ఇంటర్వూస్ (Zoom meetings,video conference calls,virtual interviews) వీటి అన్నింటికి హై స్పీడ్ అనేది తప్పనిసరిగా కావాలి.
అయితే వీటి అన్నింటికీ చాలా ముఖ్యమైనది ఏంటంటే బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ (Internet connection).కానీ ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెద్ద సమస్య .
ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్ ప్లాన్ తో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చూస్తుంటారు. మంచి స్పీడ్ ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అనేది ఉత్తమం, ఎందుకంటే బ్రాడ్‌బ్యాండ్‌తో నెట్ స్థిరత్వం ఉంటుంది.
బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ – Airtel,BSNL,JIO
ప్రస్తుతం మార్కెట్లో మూడు ప్రధాన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు నెట్ ప్రొవైడర్స్ ఉన్నాయి, వీటిలో ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్), రిలయన్స్ జియో,జియో బ్రాడ్‌బ్యాండ్ జియోఫైబర్ పేరిట, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఇంకా ఎన్నో లోకల్ బ్రాండ్స్ కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి .
ఉన్న వాటిలో ఏ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మంచిది అని అడిగితే మనం చెప్పలేకపోవచ్చు.
అయితే జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం…
ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కేవలం 499 రూపాయలు. దీనితో 40 ఎమ్‌బిపిఎస్ లభిస్తుంది. ఉచితంగా ఫిక్స్‌డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా 3.3 టిబి అంటే 3,333 జిబి డేటా లభిస్తుంది.
బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్‌లో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ .449. ఇది నెల రోజుల ప్లాన్. దీనిలో 30Mbps వేగంతో మొత్తం 3.3TB ,3300GB డేటాను పొందుతారు.
దీనికి ఎటువంటి ఓటిటి యాప్ సబ్ స్క్రిప్షన్ ఉండదు.
డేటా ముగిసిన తరువాత 2Mbps వేగంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఉచిత ఫిక్స్‌డ్ లైన్ వాయిస్ కాలింగ్ కూడా ఒక నెల వరకు లభిస్తుంది.
మరొకటి , రూ.1499 విలువ గల రూ.1499 విలువ గల ఈ నెలవారీ ప్లాన్ లో 4 టిబి అంటే 4000 జిబి డేటా లభిస్తుంది. ఇది 300 ఎమ్‌బిపిఎస్ డేటా వేగాన్ని అందిస్తుంది.గడువు పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 4 Mbps కు పడిపోతుంది.
ఈ ప్లాన్ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు (Disney + Hotstar) ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఎంపిక చేసిన సర్కిల్స్‌లోనే ఇది అందుబాటులో ఉంటుంది.
దీనితో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. అయితే ఎంపిక చేసిన సర్కిల్స్‌లోనే ఇది అందుబాటులో ఉంటుంది.
జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇతర సంస్థల ప్లాన్ల కంటే చాలా చౌకైనది అనే చెప్పాలి . దీని ధర 399 రూపాయలు. ఈ ప్లాన్ తో 3.3 టిబి అంటే 3,300 జిబి డేటా అందుబాటులో వస్తుంది. అలాగే దీనిలో కూడా ఫిక్సెడ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ అందుబాటులో ఉంటుంది.
మరి అయితే ఎవరి ప్లాన్ బెస్ట్ ??
వీటిలో ప్రస్తుతం అయితే జియో ప్లాన్ చౌకైనదని మీరు తెలుసుకోవాలి. అయితే అన్ని నెట్ ప్లాన్‌లతో ఒకే డేటా అందుబాటులో లభిస్తుంది.
అలాగే ఎయిర్‌టెల్ ప్లాన్ లో మీరు ఎక్కువ చెల్లించాలి, కానీ ఎక్కువ డాటా స్పీడ్ లభిస్తుంది. ప్రస్తుతం మెట్రో సిటీస్ ల లో జియో స్పీడ్ కూడా బాగుంది అనే మార్కెట్ లో సమాచారం .
ప్రస్తుతం జియో ఇంటర్నెట్ ,టీవీ,ల్యాండ్ లైన్ కలిసి వస్తున్న ప్యాక్ అందరూ బాగా వాడుతున్నారు . ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేయండి .