ఈ సినిమా చిత్రీకరణ(Shooting) పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్ దర్శకుడు(Kollywood Director) సెల్వ రాఘవన్(Selva Raghavan), 7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎన్జీకే వంటి విలక్షణ సినిమాలకు దర్శకత్వం(Direction) వహించాడు. అతడికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్(Fan Base) ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తాజాగా ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు(Posters), పాటలు(Songs) సినిమా పై మంచి అంచనాల(Good expectations)ను పెంచింది. ఈ సినిమా సెప్టెంబర్ 29(September 29th)న రిలీజ్ కానుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్, హీరో ధనుష్ అన్నదమ్ములు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్(Geetha arts Banner) లో విడుదల కానున్న ధనుష్ “నేనే వస్తున్నా”(Nene Vasthunna).
ఈ సినిమాలో ధనుష్, ద్విపాత్రాభినయం(Dual Role) చేస్తున్నాడు. హీరో(Hero)గా, విలన్(Vilan)గా రెండు పాత్ర(Two Roles) లను ధనుష్ ఈ చిత్రంలో పోషించాడు. ధనుష్ నెగిటివ్ రోల్(Negative Role) లో కనపడుతూండటంతో ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చగా మారింది, అంతే కాకుండా ఈ చిత్రంపై భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్(Movie makers) సినిమాపై క్యూరియాసిటీ(Curiosity)ని పెంచేందుకు వరుస అప్డేట్ల(Updates)ను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ తెలుగు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో ‘నేనే వస్తున్నా’ అనే టైటిల్(Title)ను ఖరారు(Confirm) చేస్తూ పోస్టర్(Poster) ను విడుదల చేశారు.
ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Arvind) విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకం(V Creations Banner)పై కలైపులి ఎస్ థాను(Kalaipuli S Thanu) నిర్మించాడు. ధనుష్‌కు జంటగా ఎల్లిడ్ ఆవ్రమ్(ElliD Avram) హీరోయిన్(Heroine)గా నటించింది. ఇప్పటికే ‘తిరు(Thiru)’ మూవీతో సక్సెస్(Success) అందుకున్న ధనుష్ ఈ సినిమాతో మరో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. గత నెల 18న విడుదలైన ‘తిరు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరీ(Venky Atluri) దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న ‘సార్(Sir)’ సినిమా చిత్రీకరణ దశ(Shooting Phase)లో ఉంది.