https://youtu.be/kMVgQIpkhm8

మనలో చాలా మందికి ఇంట్లో మొక్కలు, మరీ ముఖ్యంగా వంటింట్లోకి ఉపయోగపడే మొక్కలు పెంచాలని ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర, టమాట, వంకాయ, ఇలా ఎన్నో అలా పెరట్లో తుంచి ఇలా వంటలో వేస్తే భలే ఉంటుంది కదూ. అలా ఆశ ఉన్నా సదుపాయం అందరికీ ఉండదు కదా. అసలే ఈ బహుళ అంతస్తుల భవనాలలో ఇళ్ళకీ ఇళ్ళకీ మధ్య 10 అడుగుల దూరం కూడా ఉండదు ఇక పెరడు, అందులో మొక్కలు పెంచడం వంటి వాటికి అవకాశమే లేదని నిరుత్సాహ పడనక్కర్లేదు. ఇందుకోసమే, ఈ ఇబ్బందిని గమనించి ఎవరికి నచ్చిన మొక్కలు వారు పెరట్లో కాదు స్వయంగా వారి ఇంట్లోనే గోడ మీద పెంచుకునే విధంగా తయారు చేయబడింది ఈ Herbert – vertical garden.

Herbert ఇది మీ ఇంట్లో ఏ గోడ మీదైనా నిలువుగా మొక్కలను పెంచుకోవచ్చు. చూడడానికి ఒక పుస్తకాల అరలా ఉంటుంది. దీనిలో మూడు అరలు ఉంటాయి. దీనిలో ప్రత్యేకమైన ఒక కుండీలో మీకు కావాల్సిన మొక్క యొక్క విత్తనాలను చల్లి ఈ Herbert సీడ్ కాప్ పెడితే చాలు కేవలం కొద్ది రోజుల్లో ఆ మొక్క మొలకెత్తుతుంది. ఇంతకీ ఆ కుండీలో సాధారణ మట్టి కాదు ఉండేది. అసలు మట్టే కాదు. అది ఒక ప్రత్యేకమైన బయోడీగ్రేడబుల్ స్పాంజ్. అంతరిక్షంలో మొక్కలు పెంచడానికి కూడా NASA ఈ స్పాంజ్ నే వినియోగిస్తుంది. ఇక మొక్క మొలిచిన తరువాత సమయానుసారం నీళ్ళు, ఎరువు వేస్తే చాలు మీ మొక్కలు మీ కళ్ళ ముందే ముచ్చటగా పెరుగుతుంటాయి. సరే ఇంతకీ సూర్య కాంతి మాటేమిటి అనుకుంటున్నారా. ఇక దీని పైన ఉన్న ఒక LED లైట్ మొక్కలకు కావాల్సిన కాంతిని అందిస్తుంది. అంతే కాదు ఈ Herbert తీవ్రమైన చలి కాలంలో కూడా ఈ LED లైట్ ద్వారా మొక్కలు సజీవంగా ఉండడం విశేషం. దీనిలో ఒకేసారి సుమారు 15 మొక్కలు పెంచుకోవచ్చు. దీనిలో మట్టి ఉండకపోవడంతో గోడల మీద ఎంతో శుభ్రంగా, చూడడానికి అందమైన పెయింటింగ్ లా ఉంటుంది.

అంతే కాదు దీని వల్ల ఎలాంటి హానికారక ఎరువులు లేని ఆరోగ్యకరమైన, ఆహారం మీ ఇంట్లో మీరు తయారు చేసుకునట్టే. దీని వల్ల ఏటా ఎంతో వ్యవసాయ భూమిని వృధా ఆదా అవుతుంది, అంతే కాదు దీని వల్ల ఒక్కో ఇంటికీ ఏటా ఎంతో ఆహారం వృధా కాకుండా కాపాడినట్టే.

ఈ Herbert October 2017 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఇది మన దేశంలోకి రానుండా అంటే అనుమానమే. కొద్ది దేశాలకు మాత్రమే ఈ Herbert అందుబాటులోకి వస్తుంది. ఇక దీని ధర $300 పై మాటే.