ఆరోగ్యకరమైన స్నాక్స్(Healthy Snacks) అది కూడా చాలా టేస్టీ(Tasty) గా వుండే స్నాక్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వంటకం చాలా ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు సూపర్ స్నాక్ ఐటెం కూడా. ఈ రెసిపీని తయారు చేయడానికి క్వినోవా(Quinoa), ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, బెసన్ మరియు సులభంగా లభించే కొన్ని మసాలా దినుసులు మాత్రమే అవసరం. క్వినోవా ప్రోటీన్, ఫైబర్‌తో పవర్-ప్యాక్ చేయబడింది, ఇది బరువు తగ్గడానికి వాడే ధాన్యం.
ప్రతి ఒక్కరూ సాధారణ క్వినోవా ఆధారిత వంటకాలను ఇష్టపడకపోవచ్చు, కాబట్టి మీరు క్వినోవా ధాన్యంతో ట్రై చేసే ఆఫ్-బీట్ వంటకం ఇది. కట్లెట్స్ ని మరింత ఆరోగ్యవంతంగా చేయడానికి ఇంకా మీకు నచ్చిన కూరగాయలను జోడించవచ్చు. ఈ ఫ్యూజన్ రెసిపీ(Fusion Recipe)ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మీరు అల్పాహారం(Breakfast), భోజనం(Lunch), స్నాక్స్ లేదా రాత్రి భోజనం(Dinner) కోసం క్వినోవా కట్లెట్ లను తయారు చేసుకోవచ్చు.
ఈ ఆరోగ్యకరమైన చిరుతిండిని తయారు చేయడానికి 30 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. కట్లెట్లను పుదీనా చట్నీ(Mint Chutney), కెచప్(Ketchup) లేదా మీకు నచ్చిన మరేదైనా డిప్(Dip)తో సర్వ్ చేయండి. ఈ క్వినోవా కట్లెట్ రెసిపీ ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం!
కావాల్సిన పదార్దాలు:
క్వినోవా – 1 కప్పు
క్యాప్సికమ్ – 1/2
పచ్చిమిర్చి – 2
తురిమిన క్యాబేజీ – 1/4 కప్పు
ఎరుపు మిరప పొడి – 1 టీస్పూన్
డ్రై మ్యాంగో పౌడర్ – 1 టీస్పూన్
కొత్తిమీర ఆకులు – 2 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయ – 1
క్యారెట్ – 1/2
శనగ పిండి/ బేసన్ – 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
కూరగాయల నూనె – 1 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
క్వినోవాను 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు దానిని సరిగ్గా కడిగి, బ్లెండర్(Blender)లో వేసి చిక్కటి పేస్ట్ లా గ్రైండ్(Grind) చేయండి . అవసరమైతే, 1-2 టేబుల్ స్పూన్లు నీరు జోడించండి. క్వినోవా పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ మరియు కొత్తిమీర జోడించండి. బేసన్/శనగ పిండి , ఉప్పు, ధనియాల పొడి, డ్రై మ్యాంగో పౌడర్ మరియు ఎర్ర మిరప పొడి వేసి చిక్కగా అయ్యే వరకు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ మీద ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వండి. మిశ్రమం నుండి చిన్న టిక్కీలను తయారు చేసి వాటిని పాన్‌లో ఉంచండి. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసిన కట్లెట్స్ ని ఒక ప్లేటులోకి తీసుకుని మనకు నచ్చిన గ్రీన్ చట్నీ లేదా సాస్ తో సర్వ్ (Serve)చేయండి.