పండ్లలోనే రారాజు అయిన మామిడి(Mango) పండు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వేసవి(Summer) వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది.
ఈ పండ్లను ఇష్టపడని వారుండరు అని అంటారు. రుచిలో ఈ పండు అమృతంతో సమానం. అందుకే పండ్లలో మామిడి పండు రాజు అని పిలుస్తారు. ఇది ప్రపంచ ప్రజలను మైమరిపించే రుచి మామిడి సొంతం. అది తినకూడదు. ఇది తినకూడదు. అది అందుకోసం మంచిది కాదు. ఇది ఇందుకోసం మంచిది కాదు అని చెప్పి పక్కన పెట్టేయవచ్చు. కానీ ఎలాంటి సంకోచం లేకుండ తినాల్సినవి పండ్లు మాత్రమే.
అవును, పండ్లు తినడానికి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రకృతి(Nature)లో సహజంగా లభించే వాటికి నియమ నిబంధనలు అవసరం లేదు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మామిడి పండ్లని తింటే బరువు పెరుగుతారా? చాలా మంది ఈ ఉద్దేశ్యంతోనే మామిడి పండ్లకి దూరంగా ఉంటారు. అలాంటి వారు సంవత్సరానికి ఒక్క రుతువులో మాత్రమే అత్యంత ఆవశ్యకమైన మామిడి పండ్లని దూరం చేసుకుంటూ వుంటారు.
నిజానికి మామిడి పళ్ళలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి చాలా అవసరం. ఇందులో ఉండే ప్రోటీన్లు(Proteins), పీచు పదార్థాలు(Fiber), జీర్ణక్రియ(Digestion)ని బాగా మెరుగుపరుస్తాయి. దానివల్ల శరీర జీవక్రియ పనితీరు మరింత మెరుగవుతుంది.
మామిడిలో ఉప్పు, కొలెస్ట్రాల్(Cholesterol) వుండదు. అందువల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. కారణం ఎండా కాలంలో శరీరానికి ఉపయోగపడే ఎన్నో మినరల్స్(Minerals) ఇందులో వుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఐతే మామిడి పళ్ళని తినడానికి ఒక పద్దతి ఉంది.
మామిడి రసం, ఐస్ క్రీమ్, జ్యూస్, వాటి ద్వారా తీసుకుంటే కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ. అలా కాకుండా మామిడి పండుని ముక్కలుగా కత్తిరించుకుని తినాలి. ఇంకో విషయం స్నాక్స్ లా మామిడి ముక్కలని మాత్రమే తినాలి.
ఇతర ఆహారంతో పాటు తినకూడదు. ముఖ్యంగా మామిడి పండ్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్ల రొమ్మ(Breast), పెద్దపేగు క్యాన్సర్లు( Big Intestine Cancer) రావని అంటున్నారు.
ఇక పాదాల పగుళ్ల సమస్య(Foot Cracked Problem)తో బాధ పడే వారు మామిడి జిరుగుకు మూడు ఇంతులు నీళ్లు కలిపి ప్రతి రోజూ రాసుకోవాలి ఇలా చేయడం వల్ల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్ర సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు రాత్రి ఒక మామిడి పండును తింటే చక్కగా నిద్ర పడుతుంది.
మామిడిపండ్లు ముఖ్యంగా మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ హెల్తీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల పురుషుల్లో హెల్తీ స్ఫెర్మ్ ఉత్పత్తి అవుతుంది మరియు స్పెర్మ్ యొక్క క్వాలిటీ మెరుగుపడుతుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది లైకింగక సామర్థ్యంను పెంచుతుంది .
ఈ పండులో ఉండే న్యూట్రీషియన్స్(Nutrition’s) వ్యక్తిలో వ్యాధిని రోధకత(Disease resistance)ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు డయాబెటిస్(Diabetes) తో పోరాడుతుంది, మాన్ సూన్ చాలా మంది ఇండియన్ పురుషులు త్వరగా జబ్బున పడుతుంటారు. పుల్లపుల్లని పచ్చిమామిడికాయలోని బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఇంకా మామిడి పండ్ల వల్ల పురుషులకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తాయి మరియు శారీరకంగా ఫిట్ గా ఉంచుతాయి.
మామిడిపండ్లలో ఎసిడిటిని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడిపండ్లలో ఉండే మాలిక్ యాసిడ్(Malic Acid) మరియు సిట్రిక్ యాసిడ్(Citric Acid) ను కలిగి ఉండటం వల్ల ఇది ఎసిడిక్ లెవల్స్(Acidic Levels) ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు వుండే మామిడి పండు నిరభ్యంతరంగా తిని వేసవిని ఆస్వాదించండి.