హలీమ్ విత్తనాలు(Halim Seeds), ఈ విత్తనాలను అలీవ్(Aliv), గార్డెన్ క్రెస్(Garden Cress) అని కూడా పిలుస్తారు, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) మరియు పోషక(Nutritions) లక్షణాలు కలిగి వున్నాయి. ఈ విత్తనాలు పోషకాహారాన్ని అందించడమే కాకుండా, వ్యాధులను దూరంగా ఉంచుతూ మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే ‘ఫంక్షనల్ ఫుడ్స్(Functional Foods)’ విభాగంలోకి వస్తాయి. ఈ టాంజీ ఫ్లేవర్ విత్తనాలను సలాడ్‌లు(Salads), సూప్‌లు(Soups) మరియు స్మూతీస్‌ల(Smoothies)లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్(Fiber Content) కారణంగా ఉపయోగిస్తారు. ఇది కండరాల(Muscles)ను నిర్మించడం(Built)లో సహాయపడుతుంది. వినియోగించే ప్రతి 100 గ్రాములకి, హలీమ్ కేలరీలు మొత్తం 157.100 గ్రాములకు 6.86 గ్రాముల కొవ్వు తక్కువగా ఉంటుంది.
ఈ లడ్డులు తినడం వల్ల జుట్టు బలం(Hair Strong)గా ఉంటుంది. ముఖ్యంగా ఈ లడ్డులను తినడం ద్వారా పీసీఓడీ(PCOD), పీసీఓఎస్(PCOS), ఇర్రేగులర్ పీరియడ్స్(Irregular Periods) కి చెక్ పెట్టచ్చు. ఈ లడ్లను సాధారణంగా చలికాలంలో తయారుచేస్తారు. అలివ్ విత్తనాలు ఒంటికి వేడిచేస్తాయి. ముఖ్యంగా ఈ లడ్లను డెలివరీ తర్వాత మహిళలకు ఇస్తారు. ఇవి పాలిచ్చే మహిళలకు మేలు చేస్తాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కాల్షియం(Calcium), ఐరన్(Iron) పుష్కలంగా ఉంటాయి. హలీమ్ విత్తనాలు విటమిన్లు ఎ, సి(Vitamin A.C)తో పాటు గణనీయమైన మొత్తంలో ఐరన్, కాల్షియం, అయోడిన్(Iodine) మరియు ఫోలిక్ యాసిడ్(Folic Acids) ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్(Minerals) పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్(Cancer)తో పోరాడుతుంది. ఇంత హెల్దీ లడ్డుల(Healthy Laddu)ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం!
ఆలివ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు:
అలివ్ / హలీమ్ విత్తనాలు – 1 కప్పు
తురిమిన బెల్లం – 1 కప్పు
కొబ్బరి నీరు – 3 కప్పు
తురిమిన కొబ్బరి – 1/4 టీస్పూన్
జాజికాయ పొడి – 1/4 టీస్పూన్
యాలకుల పొడి – తగినత
తరిగిన డ్రై ఫ్రూట్స్ – సరిపడా
తయారు చేయు విధానం:
ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నీళ్ల(Coconut Water)లో అలివ్ గింజలను నానబెట్టండి. కొబ్బరి నీరు అందుబాటులో లేకపోతే, మీరు సాధారణ నీటిని ఉపయోగించవచ్చు.దీన్ని సుమారు 2 గంటలు నానబెట్టండి. పాన్ వేడి చేసి అందులో నానబెట్టిన అలివ్ గింజలు, బెల్లం, కొబ్బరి వేసి బాగా కలపండి మరియు మిశ్రమం కలిసే వరకు మీడియం వేడి మీద ఉడికించాలి.15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆపివేయండి, అందులో డ్రైఫ్రూట్స్(Dry Fruits), జాజికాయ(Nutmeg), యాలకుల పొడి(Ilachi Powder)ని జోడించండి. మిశ్రమం వెచ్చగా వున్నప్పుడు లడ్డులు చుట్టుకోవాలి. అంతే ఎంతో హెల్దీ గా, టేస్టీ(Tasty) గా వుండే హలీమ్ లడ్డులు రెడీ. వీటిని ఫ్రిజ్(Fridge)లో ఉంచితే బాగుంటుంది.
న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్:
62 గ్రా కొవ్వు (49.32%), 6 గ్రా ప్రోటీన్ (5.14%), 41 గ్రా పిండి పదార్థాలు (32.88%), 16 గ్రా ఫైబర్ (12.46%)