రోజు ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు(Boiled Egg) తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits), అలాగే విటమిన్లు(Vitamins) అత్యధికంగా కలిగిన ఆహార పదార్ధం ఇదే, నరాల బలహీనత(Nervous Weakness) ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెప్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఒక గుడ్డు తినాలి అంటారు నిపుణులు.
ఇందులో విటమిన్స్, సెలీనియం, క్యాల్షియం, జింక్ మరియు ఇతర పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు (Nutrition’s)ఉంటాయి. ఇవి అన్ని వయసుల వారికి మేలు చేస్తాయి. రోజూ గుడ్డుని తినడం వల్ల ప్రోటీన్స్(Proteins), విటమిన్స్(Vitamins), పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. పాటు విటమిన్ ఎ(Vitamin A), బి5(B5), బి12(B12), బి2(B2), కాల్షియం(Calcium), జింక్(Zinc) వంటి ఖనిజాలు(Minerals), 77 క్యాలరీలు(Calories), 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్(Reduces Bad Cholesterol) తగ్గడమే కాకుండా.. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్(Controls Glucose Levels)లో ఉంటాయి. అయితే చిన్న పిల్లలు ఉడికించిన గుడ్డు అంత గా ఇష్టపడరు. వాళ్ళకోసం వెరైటీ రెసిపీస్(Variety Recipes) చేసిపెట్టచ్చు. ఎంతో సులభం గా చేసుకునే ఎగ్ శాండ్విచ్(Egg Sandwich) ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి !
కావాల్సిన పదార్థాలు:
బాయిల్డ్ ఎగ్స్ – 4
బ్రెడ్ పీసెస్ – 4
గ్రీన్ చట్నీ లేదా సాస్
వెన్న లేదా నెయ్యి
కరం పొడి – 1/2 టీ స్పూన్
ఉప్పు – 1/2 టీ స్పూన్
చాట్ మసాలా – 1/4 టీ స్పూన్
తరిగిన ఉల్లిపాయలు – 2
సన్నగా తరిగిన కొత్తమీర – తగినంత
సన్నగా తరిగిన టమాటో ముక్కలు – ఆప్షనల్
తయారు చేసుకునే విధానం:
- ముందుగా ఉడికించిన గుడ్డలను సన్నగా తురుముకోవాలి.
- తురిమిన గుడ్ల(Grated Eggs)ను ఒక బౌల్ లో వేసుకుని అందులో కారం, ఉప్పు, చాట్ మసాలా, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తమీర, కావాల్సిన వాళ్ళు సన్నగా తరిగిన టొమాటోలు వేసుకుని బాగా(Mix Well) కలుపుకోవాలి.
- ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైస్ తీసుకుని ఒక్క బ్రెడ్ కి గ్రీన్ చట్నీ(Green Chutney) లేదా సాస్(Sauce) వేసుకుని ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ పై స్టఫ్(Stuff) చేసుకోవాలి.
- స్టఫ్ చేసిన బ్రెడ్ పై వెన్న లేదా నెయ్యి రాసిన మరో బ్రెడ్ ని పెట్టి కవర్ చేసుకోవాలి .
- ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైస్ ని పాన్ మీద లేదా ఎగ్ శాండ్విచ్ మేకర్ లో చేసుకోవచ్చు.
- ముందుగా పాన్ మీద ఈ రిసిపిని చేసుకుందాం
- పాన్ పైన నెయ్యి రాసి ఎగ్ శాండ్విచ్ ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తయారైన ఎగ్ శాండ్విచ్ ని ఒక్క ప్లేట్ లో పెట్టుకోండి
- అలాగే శాండ్విచ్ మేకర్ లో ఆయిల్ వేసి గ్రీజ్ చేసి, ప్రీ హీట్(Pre Heat) చేసిన శాండ్విచ్ మేకర్(Sandwich Maker) లో మనం తయారు చేసిపెట్టుకున్న ఎగ్ శాండ్విచ్ ని పెట్టుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి
- మనకు ఇష్టమైన షేప్ లో కట్ చేసుకుని ఎగ్ శాండ్విచ్ ని సాస్ తో సర్వ్(Serve) చేయండి