మానవ శరీరం నిర్మాణం ఎంతో సంక్లిష్టమైనదని చెప్పాలి. అందులో ఉండేటటువంటి ముఖ్య అవయవాలైన మెదడు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటివి కూడా సంక్లిష్టమైనవే. వీటి పని తీరులో ఇబ్బంది వస్తే మనిషి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ప్రాణమే పోయే పరిస్థితి వస్తే అవసరాన్ని బట్టి ఆయా అవయవ మార్పిడి లేదా వీటిలో ఏమైనా చిన్న చిన్న పరికరాలు అమర్చి ప్రాణాలు నిలబెట్టడం మనకు ఇప్పటికే తెలుసు.
ఇలా అమర్చిన పరికరాలను medical implants అంటారు. వీటి ద్వారా వైద్యులు ఆ సంబంధిత అవయవ పని తీరును ఇప్పటిదాకా electromagnetic waves ద్వారా తెలుసుకుంటున్నారు. ఉదా: ఎండోస్కోపీ వంటివి దీని ఆధారంగానే చేస్తారు. మనిషి గొంతులోకి ఒక చిన్న గొట్టాన్ని లోపలికి పంపించి దాని ద్వారా ఇవతల కంప్యూటర్ లోకి ఆ లోపలి భాగం ఎలా ఉందో సమాచారం సేకరిoచబడుతుంది. అయితే ఈ పద్ధతిలో సెకనుకు (50 kb/second) చాలా తక్కువ సమాచారం సేకరించబడుతుంది. University of Illinois College of Engineering కు చెందిన పరిశోధకులు మన శరీరం లోపలి implants లో ultra sound transmitter ను అమర్చడం వల్ల దాని ద్వారా ఆ అవయవం తాలుకూ HD data transfer (live Video) స్ట్రీమింగ్ సాధ్యపడుతుంది అంటున్నారు. అదెలాగో చూద్దాం.
University of Illinois కి చెందిన Andrew Singer తన బృందం తో కలిసి ఒక ప్రయోగం చేసారు అదేంటంటే ఒక నీళ్ళ ట్యాంక్ లో మొదటి సారి పంది మాంసం ఉంచి దాని మధ్యలో ఒక ultra sound transmitter ను ఉంచగా, దీని నుంచీ వెలువడే అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా బయట ఉండే కంప్యూటర్ కు 30 mbps స్పీడ్ తో data transfer జరిగింది. ఇక రెండవసారి గేదె మాంసం ఉంచి ప్రయత్నించగా రెండవసారి కూడా అదే స్పీడ్ తో data transfer జరిగింది. అంటే ఈ స్పీడ్ తో ఇంచుమించుగా మనం ఇంట్లోని wi-fi తో ఎలా HD సినిమాలు సైతం చూడవచ్చో అలాగా మన శరీరం లోపలి నుంచీ అలా లైవ్ HD స్ట్రీమింగ్ జరగడానికి ఆస్కారం ఉందని, అది కూడా ఆ టిష్యూ కు ఎలాంటి హాని కలుగుకుండా జరుగుతుందనీ Andrew అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం Andrew బృందం ప్రత్యక్షంగా ఈ ultra sound transmitter లైవ్ టిష్యూ లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలియడం కోసం ప్రయోగం చేయనున్నారు. ఇది ఫలిస్తే దీని వల్ల చాలానే ఉపయోగాలున్నాయి అని చెప్పాలి.
ఇక పై హృద్రోగులకు అమర్చే pacemakers మరి కొన్ని medical implants అయినటువంటి defribillators ఇంకా మరెన్నో వైద్య పరీక్షలలో ఇది ఒక పెను విప్లవాన్ని తెస్తుంది అనడంలో సందేహం లేదు.