జుట్టు రాలే సమస్య (Hair loss) తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. కనీసం 30ఏళ్లు కూడా రాకముందే విపరీతంగా జుట్టు ఊడిపోతోందని ఈరోజుల్లో చాలా మంది బాగా బాధపడుతుంటారు.

అయితే,కొన్ని రకాల చిట్కాలు ఫాలో అయ్యి,కొన్ని రకాల ఆహారం తీసుకుంటే చాలు అని నిపుణులు సూచిస్తున్నారు.

హెయిర్ స్టైలిషింగ్ (Hair styling) కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్స్, కర్లర్స్ వాడుతుంటారు. అయితే ఎక్కువగా వేడి ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లిపోవడం,జుట్టు  గడ్డిలా మారి రాలిపోవడం జరుగుతుంది.అందుకని వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

మంచి కండీషనర్ (conditioner) కూడా జుట్టుని కాపాడుతుంది.

షాంపూ, కండీషనర్‌లు ఏవి పడితే అవి ఉపయోగించకూడదు. ఉపయోగించడం వాళ్ళ జుట్టు రాలడం అనేది తగ్గించవచ్చు.

మీ శిరోజాలు కనుక  డ్రైగా ఉంటే కచ్చితంగా మీరు మాయిశ్చరైజింగ్ షాంపూతో తలస్నానం చేయడం మంచిది.

సహజసిద్ధమైన హెయిర్ మాస్క్‌లు వేయడం కూడా చాలా ముఖ్యం. 

ఇందుకు ఒక అరటిపండులో పాలు, కోకో పౌడర్లు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి తలకు పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.

జుట్టుకి పుల్లని పెరుగు వాడకం గురించి ఎప్పటి నుండో మనలో చాలా మందికి తెలుసు

పుల్లని పెరుగు మిశ్రమాన్ని జుట్టు మీద బాగా అప్లై చేసి షవర్ క్యాప్ ఉంచండి. అరగంట పాటు ఉంచుకుని ,తరువాత జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి.

కొబ్బరి నూనె

oil massage

కొంచెం కొబ్బరినూనె తీసుకోండి. ఆ కొబ్బరి నూనెలో మందార పూలను వేయండి. రెండింటినీ బాగా మరగబెట్టండి. తర్వాత చల్లార్చండి. ఆ నూనెను ప్రతి రోజు తలకు పట్టించండి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఈ నూనెను వాడితే జుట్టు ఊడిపోవడం క్రమంగా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఉసిరి

ఉసిరిలో ఉండే విటమిన్ సి (Vitamin c) జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెండు స్పూన్ల ఉసిరి పొడిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి స్కాల్ఫ్ కి అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసుకోవాలి.

ఉల్లి రసం

‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే మన సామెత అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ ఉల్లి రసాన్ని (onion juice)  రెండు లేదా మూడుసార్లు వారానికి  తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయటం వల్ల మూడు నెలల్లో ఈ జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.

కలబంద

కలబంద (అలోవీరా)లో ఉండే ఎంజైములు జుట్టు ఎదుగుదలకు బాగా సహకరిస్తాయి.

Aloevera

తలకు కలబంద జ్యూస్ను పట్టించడంతో పాటు పరగడుపునే ఒక టీస్పూన్ కలబంద జ్యూస్ తీసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.

నెత్తిపై ఉన్న మృత కణాలను కలబంద తొలగిస్తుంది. అంతేకాకుండా కుదుళ్లను దృఢంగా చేస్తుంది.

ఆహారం

అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసె గింజలు వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు మన జుట్టు రాలే సమస్య నివారణకు బాగా ఉపయోగపడతాయి.

బీట్‌రూట్ జ్యూస్

మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి మన వంటింట్లో పరిష్కారం దొరుకుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ.

Beetroot juice

మన ఒంట్లో పోషకాహార లోపాన్ని బీట్‌రూట్ పూర్తిచేస్తుంది. కాబట్టి రోజూ తీసుకునే ఆహారంలో బీట్‌రూట్ జ్యూస్‌ను కూడా చేర్చితే జుట్టు రాలడాన్ని నివారించొచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ (Green tea) అన్ని ఆరోగ్య సమస్యలకు మంచిదే. గ్రీన్ టీ వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా కొత్త వెంట్రుకల ఉత్పత్తి కూడా జరుగుతుంది.

Green tea

ఇది మానవ జీవక్రియను పెంచి జుట్టు ఎదుగుదల రేటును కూడా పెంచుతుంది.ఒకసారి గ్రీన్ టీ సొల్యూషన్‌ని మీ జుట్టుకు పట్టించండి తేడా మీకే తెలుస్తుంది!

మెడిటేషన్

ఒత్తిడి! మనిషిలోని అనేక సమస్యలకు ఇదే కారణం.

meditation

దీన్ని తగ్గించుకో గలిగితే చాలా రుగ్మతలు దూరమవుతాయి. జుట్టు రాలిపోవడం కూడా..! మీరు రోజూ ధ్యానం (మెడిటేషన్ – meditation) చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకుని జుట్టు రాలడాన్ని కూడా నివారించొచ్చు.

నిద్ర

మీ జీవన విధానంలో ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది. ప్రతీ రోజూ కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అనేది ఎంతో అవసరం.

బయటకి వెళ్లేటపుడు హానికరమైన UV కిరణాలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సన్‌స్క్రీన్ క్రీమ్ (sun screen cream), హెయిర్ స్ప్రేలు (Hair spray) క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ సింపుల్ టిప్స్ ని పాటించి జుట్టు రాలే సమస్యని తగ్గించు కొని ,ఆరోగ్య వంతమైన శిరోజాల తో ఆనందం గా ఉండండి .

కానీ కొందరిలో సమస్య తీవ్రంగా ఉంటుంది…అలాంటి వారు డాక్టర్ సూచనల మేరకు ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది.