ఒకప్పుడు నల్లని జుట్టు కలిగి ఉండడం గొప్పగా ఉండేది. కానీ ఇప్పటి తరం ఎప్పుడూ అదే నల్లని జుట్టా అని అంటున్నారు. కాస్తంత కొత్తదనం కోసం ముఖంలో ఏ మార్పు చేసినా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా మనలో ఏదైనా మార్పు చేసుకోవాలంటే ముందు ఉండేది జుట్టు, అలాగే తల కట్టు (hair style). అన్నిటికంటే ముందు జుట్టుకు రంగు వేసుకుంటే ఇక కొత్తదనం, ఫాషన్ ను అనుసరించినట్టే. ఇందుకోసం జుట్టుకు రంగులు వేసుకుంటున్నారు అమ్మాయిలు.
ఆ అందం కోసం ఆయా ఉత్పత్తులలో ఏముందో కూడా తెలుసుకోకుండా ఉపయోగించేస్తున్నారు యువతులు. వాణిజ్య హెయిర్ కేర్/కలర్ ఉత్పత్తులో ఎన్నో హాని కారక రసాయనాలు ఉన్నాయని వాటిని దీర్ఘ కాలం వాడితే జుట్టు రాలిపోవడం, పలచబడిపోవటం తో పాటు ఆరోగ్యానికి హాని చేసే కాన్సర్ వంటి ముప్పు దాగి ఉందని అంటున్నారు ఫిన్లాండ్ పరిశోధకులు.
University of Helsinki, Finland కు చెందిన పరిశోధకులు Sanna Heikkinen బ్రెస్ట్ కాన్సర్ సోకిన 8000 మంది రోగుల మీద అధ్యయనం చేసారు. ఈ పరిశోధనలో తేలింది ఏమంటే వాణిజ్య కేశ ఉత్పత్తులను వాడటం వల్ల బ్రెస్ట్ కాన్సర్ వచ్చే ముప్పు అధికంగా ఉందని. అంతే కాదు, ఆడవారిలో 50 ఏళ్ల లోపు కాన్సర్ రావడానికి మరి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటంటే
• hormonal contraceptives వాడటం
• అధికంగా మద్యం సేవించడం
• జుట్టుకు రసాయనాలతో కూడిన ఉత్పత్తులను అధికంగా వాడటం
• మొదటి సంతానం ఆలస్యంగా కలగటం
• కూర్చుని పని చేసే జీవన విధానం
వీటన్నిటి వల్లా ఆడవారికి కాన్సర్ ముప్పు పొంచి ఉందని Sanna అంటున్నారు. ఈ అధ్యయనంలో మరో కీలక అంశం ఏంటంటే ఈ ఎనిమిది వేల మందిలో 60 శాతం మంది తాము 50 ఏళ్ల కన్నా ముందే మమ్మోగ్రఫి (opportunistic mammography) చేయించుకున్నామని తెలిపారు. అయితే opportunistic mammography చేయించుకోవడం వల్ల హానికారక రేడియేషన్ కు గురి కావాల్సి వస్తుందని, అది ఆరోగ్యం పై ప్రతికూల ఫలితాన్ని చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆడవారు అందరికీ opportunistic mammography ని గురించి అవగాహన కల్పించాలని అంటున్నారు.