ప్రముఖ సెర్చింజన్ గూగుల్(Google) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల(Engineering Graduates)కు శుభవార్త ప్రకటించింది.
బెంగళూరు(Bangalore)లోని గూగుల్ కార్యాలయం)(Network Officeలో నెట్వర్క్ ఇంజనీర్ (Network Engineer) ఖాళీల భర్తీకి గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 31(March 31st)లోపు ఆన్లైన్(Online)లో దరఖాస్తు(Applications) చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలివే:
- అభ్యర్థులకు ప్రధానంగా ఏదైనా టెక్నికల్(Technical) విభాగంలో మాస్టర్స్ డిగ్రీ(Masters Degree) లేదా సమానమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్(Practical Experience) ఉండాలి.
- ఆపరేటింగ్ ఎంటర్ప్రైజ్ క్లాస్ రూటర్లు(Operating Enterprise Class Routers), స్విచ్‌ల(Switch)పై పనిచేసిన అనుభవం(Experience) ఉండాలి.
- బ్యాక్‌ప్లేన్(Back Plane), ఏఎస్‌ఐటీ(ASIT) ఫంక్షనాలిటీ(Functionality), డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్(Distributed Architecture)లతో సహా నెట్వర్క్ హార్డ్‌వేర్ (రౌటర్లు, స్విచ్‌లు) ఆర్కిటెక్చర్లపై పనిచేసిన అనుభవం ఉండాలి.
- పైథాన్(PHYTHON) లేదా ఇతర స్క్రిప్టింగ్ భాష(Scripting Language)ల్లో నైపుణ్యం(Expert) ఉండాలి.
- ఈథర్నెట్(Ethernet), Wi-Fi, TCP/IP, HTTP వంటి నెట్వర్కింగ్, అప్లికేషన్ ప్రోటోకాల్స్‌పై(Applications Protocols) పరిజ్ఞానం(Knowledge) ఉండాలి.
- ఓపెన్ఫ్లో(Open Flow), సాఫ్ట్ వేర్ నెట్వర్కింగ్ (Software Networking) పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపిక చేయబడిన అభ్యర్థుల బాధ్యతలు
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు టీమ్‌లోని ఇతర సభ్యులతో ఆన్-కాల్(ON-CALL) లేదా ఇంటరప్షన్ షెడ్యూల్(Internship Schedule)ను మెయిన్‌టెయిన్(Maintain) చేయడంలో పాల్గొనాలి. కొన్ని సందర్భాల్లో వీకెండ్స్‌లో కూడా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. వైర్డు, వైర్లెస్ కనెక్టివిటీ(Wireless connectivity)తో సహా మల్టీ-వెండర్(Multi Vendor), ఓపెన్ ఫ్లో ఎస్డీఎన్(Open Flow SDN) –ఆధారిత(Based) IPv4/v6 నెట్‌వర్క్‌ల(Networks)లో వచ్చే సమస్యలను పరిష్కరించాలి.
- టీం తో పాటు ఆపరేషనల్(Operational), డిప్లాయ్‌మెంట్‌కు(Deployment) సంబంధించిన సమస్యలపై సమీక్షించాలి. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలి.
- ఆటోమేషన్(Automation) సామర్థ్యాలను అంచనా వేయాలి. కోడ్ రివ్యూస్‌ను(Code Reviews) సమీక్షించాలి.
- ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్(Architecture), డెవలపర్ల సహకారంతో నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.
- నెట్వర్క్ ఆపరేషన్(Network Operations), అమలులో వచ్చిన సమస్యల(Problems)ను గుర్తించాలి. ఇంజనీరింగ్ ఆపరేటర్లు(Engineering Operators), డిప్లాయ్‌మెంట్(Departments), డెవలపర్ల(Developers) సహాయంతో ఆయా నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలి.