ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. త్వరలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ – APPSC) అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ నోటిఫికేషన్లకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ నేత విజయ సాయిరెడ్డి ఏపీపీఎస్సీ తాజాగా కీలక ప్రకటన వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు (Notifications) జారీ చేయనున్నట్టు అయన ట్వీట్ చేసారు.
మొత్తం 1,180 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.ఇప్పటికే జగన్ (CM Jagan) ప్రభుత్వం నోటిఫికేషన్ల జారీకి అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది.
ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోందని విజయ సాయిరెడ్డి వివరించారు. అలాగే రిజర్వేషన్ (Reservation) అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి పెంపునకు ప్రతిపాదను పంపినట్టు తెలిపారు.
ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే 15 విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
నోటిఫికేషన్ల రిలీజ్ కు అంతా సిద్ధంగా ఉన్నామని ఏపీపీఎస్సీ వర్గాలు ప్రకటించాయి.అయితే అవసరమైన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి అందని కారణంగా జాప్యం అవుతున్నట్లు సమాచారం.
సమగ్రంగా అధ్యయనం చేసి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉన్నందున ప్రక్రియ ఆలస్యమైనా.. సెప్టెంబర్ 10వ (September 10th) తేదీలోగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్ (యునాని) – 26
మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) – 53
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) – 72
లెక్చరర్ (హోమియో) – 24
లెక్చరర్ (డాక్టర్ ఎన్ఆర్ఎస్జీఏసీ ఆయుష్) – 3
జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ – 670
అసిస్టెంట్ ఇంజినీర్లు – 190
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ -3 (ఎండోమెంట్) – 60
హార్టికల్చర్ ఆఫీసర్ – 39
తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్) – 5
డిస్ట్రిక్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 4
ఇంగ్లిష్ రిపోర్టర్ (లెజిస్లేచర్) – 10
జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ – 10
డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ – 10
అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్ సర్వీస్ – 9
ఇటీవలే ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,413 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది.
దీని సంబంధించి సీఎం జగన్ జూన్ లోనే జాబ్ కేలండర్ (Job calender) ను రిలీజ్ చేసి రాష్ట్రం లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారని సమాచారం. మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల ఖాళీల వివరాలను ఆ జాబ్ క్యాలెండర్ లో ఉంచారు.
ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ (prepare)అవుతున్న అభ్యర్థులు మనోధైర్యం కోల్పోకుండా ఉద్యోగాలను భర్తీ చేపట్టినట్లు సీఎం ఆ సమయంలో తెలిపారు.
ఇందులో భాగంగా ఏ నెలలో ఏ ఉద్యోగాల భర్తీ జరుగుతుందో అభ్యర్థులకు ముందుగానే తెలిసేలా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చినట్లు సీఎం వివరించారు.
జాబ్ కేలండర్ ప్రకారం ఈ ఏడాది జులై నుంచి నెలల వారిగా చేపట్టనున్న నియామక వివరాలు
జూలై-2021: బ్యాక్లాగ్ వేకెన్సీలు-ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు – 1,238
ఆగస్టు-2021: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 & గ్రూప్ 2-36
సెప్టెంబర్-2021: పోలీస్ శాఖ ఉద్యోగాలు-450
అక్టోబర్-2021: వైద్య శాఖలో డాక్టర్స్ & అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 451
నవంబర్-2021: వైద్య శాఖలో పారామెడికల్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు- 5,251
డిసెంబర్-2021: వైద్య శాఖలో నర్సులు – 441
జనవరి-2022: విద్యాశాఖ- లెక్చరర్లు (డిగ్రీ కాలేజీ) – 240
ఫిబ్రవరి-2022: విద్యాశాఖ- అసిస్టెంట్ ప్రొఫెసర్లు (యూనివర్సిటీలు) – 2,000
మార్చి-2022: ఇతర శాఖలు – 36
మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయనున్నవి : 10,143
నిరుద్యోగులకి మంచి శుభవార్త ఏ కదా .. ఏ పి పి స్ సి కి ప్రిపేర్ అవుతున్నవారు అందరికీ తెలుగుగీక్ తరపున ఆల్ ది వెరీ బెస్ట్ ..
మరిన్ని ఎడ్యుకేషన్,జాబ్,ఎంటర్టైన్మెంట్,హెల్త్,టెక్నాలజీ తదితర అప్డేట్స్ కోసం telugugeek.com ని ఫాలో అవ్వండి ..