ఏ రంగంలో అయినా ఆర్ధిక సేవలను పొందాలంటే మనం గుర్తింపు కలిగిన డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయాలి. అలాంటి డాక్యూమెంట్స్ లో పేర్మన్నెంట్ అకౌంట్ నెంబర్(PAN) చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యము.
పన్ను చెల్లింపుదారులు అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్ -ITR) దాఖలు చేయాలన్న, బ్యాంక్ అకౌంట్ (Bank account), పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయాలన్న, పాన్ కార్డు చాలా అవసరం అవుతుంది. అయితే అనుకోకుండా ఈ కార్డు ని ఎవరైన పోగొట్టుకుంటే? అంత బాధపడవలసిన అవసరం లేదు.
ఆన్లైన్ లో పాన్ కార్డు ని తిరిగి పొందవచ్చు. పాన్ కార్డులను ఇష్యూ చేసే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) ఆఫీషియల్ వెబ్ సైట్ నుంచి పాన్ కార్డు ని తిరిగి పొందవచు. ఈ ప్రాసెస్ అంత జరగడానికి కొంత సమయం పడుతుంది.
అలాంటప్ప్పుడు మనకు ఏదైనా అత్యవసరానికి పాన్ కార్డు అవసరం ఉంటే వెంటనే మీరు ఎలక్ట్రానిక్ పాన్ కార్డు లేదా ఈ – పాన్ కార్డు ని ఆన్ లైన్ (online) లో డౌన్ లోడ్ (Download)చేసుకున్న వెసులుబాటు ను ఎన్ఎస్డీఎల్ (NSDL) కల్పిస్తోంది.
ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (E-Governance Infrastructure), యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీస్ సర్వీసెస్ (UTI Infrastructure technology services)అనే రెండు సంస్థల ద్వారా పాన్ కార్డులను పొందచ్చు. ఈ రెండు సంస్థలకు మాత్రమే పాన్ కార్డు జారీ చేసే అధికారాన్ని ఆదాయపు పన్ను శాఖ అందించింది.
ఆన్ లైన్ లో ఈ – పాన్ కార్డు ని ఎలా పొందాలో తెలుసుకుందాం.
1. ఆన్లైన్లో ఈ -పాన్ కార్డును డౌన్లోడ్ చేయడానికి మీరు యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL) https://www.utiitsl.com/ అఫిషియల్ వెబ్ సైట్ వెళ్ళాలి.
‘పాన్ కార్డ్ సేవలు’ ఆప్షన్ (Pan card services option) ను సెలెక్ట్ చేయండి.
‘డౌన్లోడ్ ఇ-పాన్’ (Download E-Pan)ఆప్షన్ మీద క్లిక్ చేయండి
మీ పాన్ కార్డ్ డీటైల్స్ నమోదు చేయాలి
తరువాత మీ పుట్టిన తేదీ (Date of Birth)వంటి మీ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్ని కూడా ఎంటర్ చేయాలి
క్యాప్చా (Captcha) వివరాలను సబ్మిట్ చేయడం ద్వారా మీ వివరాలను ధృవీకరించాలి
ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ (Email ID, Register mobile number)పై లింక్ ని పొందుతారు..
మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను కంఫర్మ్ చేయడానికి ఓటీపీ (OTP)వస్తుంది.
ఓటీపీని నమోదు చేయాలి. ఓటీపీ నమోదు చేసిన తరువాత మీ ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీరు అతి తక్కువ టైం లోనే ఈ -పాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో అందించే అన్ని ఆర్థిక సేవల కోసం వినియోగించుకోవచ్చు.
చూసారు కదా, పోగుట్టుకున్న పాన్ కార్డు ని ఎలా పొందాలో … ,మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పాన్ కార్డు పోగొట్టుకుంటే వెంటనే వారికి షేర్ చేసి ఈ -పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియచేయండి ..
మరిన్ని మంచి ఆర్టికల్స్ కోసం ఫాలో అవండి , తెలుగుగీక్.కామ్ ,
ఫేసుబుక్ పేజీ – https://www.facebook.com/teluguGeek