ప్రపంచీకరణ దృష్ట్యా విమానాల సంఖ్యా పెరిగింది, ప్రయాణీకుల సంఖ్యా పెరిగింది. ప్రపంచంలో ఆమూల నుంచి ఈ మూల వరకూ విమానాల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భద్రత దృష్ట్యా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా అప్పుడప్పుడు అపశ్రుతులు దొర్లుతూనే ఉన్నాయి. ఒక్క సారి విమానం గాల్లోకి ఎగిరాక కొన్ని వేల అడుగుల ఎత్తులో బాంబు పేలుళ్ళ నుంచీ కాపాడటం కష్టమే. ఈ లోపం కారణoగానే విమానాలకు తీవ్రవాదుల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ ముప్పు పొంచి ఉండచ్చు. అందువల్ల పరిశోధకులు విమానాల్లో ఇక పై బాంబు పేలుళ్లను అరికట్టేందుకు ఒక పరికరాన్ని తయారు చేసారు. ఆ వివరాల్లోకి వెళ్తే…

flybag

UK లోని University of Sheffield కి చెందిన పరిశోధకులు ఒక కొత్త రకమైన linen ను తయారు చేసారు. దీనిని విమానాల్లో luggage compartment లో, ఈ linen ను అమర్చుతారు. అప్పుడు విమానాల్లో ఏదైనా luggage లో బాంబు కానీ మరే ఇతర పేలుడు పదార్ధాలు ఉన్నా, వాటి ధాటికి తట్టుకునే విధంగా దీనిని తయారు చేసారు. అంటే ఒక వేళ luggage compartment లోని ఏ సూట్ కేసు లోనైనా బాంబు ఉన్నా అది పేలకుండా అణిచివేస్తుంది. దాంతో విమానానికీ అందులోని ప్రయాణీకులకు ఎలాంటి హాని జరగకుండా, విమానం చెక్కు చెదరకుండా ఉంటుoదన్న మాట. అవునా, అయితే ఈ linen ను దేనితో తయారు చేసారు అనుకుంటున్నారా. ఈ linen ను అనేక రకాలైన fabric తో అనేక పొరలతో పాటు aramid వంటి పదార్ధాలతో తయారు చేసారు. ఈ aramid ను ballistic body armour లో ఉపయోగిస్తారు. అందువల్ల ఈ Fly bag linen బాంబు ధాటినీ, దాని తీవ్రతను తట్టుకోగలుగుతుంది. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే ఇది (Fly bag) పూర్తిగా ఫ్లెక్సిబుల్. అందువల్ల తేలిగ్గా అన్ని విమానాల్లోని luggage కంపార్ట్మెంట్ లలో అమర్చవచ్చు. అంతే కాదు ఈ Fly bag ను ఒక విమానంలో test బాంబు ద్వారా పరీక్షించగా ఇది పూర్తిగా బాంబు ధాటిని తట్టుకుని విమానానికి ఏమీ కాకుండా కాపాడగలిగింది. అదే ఈ Fly bag లేకుండా అదే బాంబు ను తిరిగి ప్రయోగించినప్పుడు విమానంలో పేలుడు సంభవించింది. ఆ చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

flybag

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి పరికరాలు ఎంతో అవసరం. ఎన్నో స్థాయిల భద్రతను దాటుకుని మరీ విమానాల్లో బాంబులు పెట్టి విధ్వంసం చేస్తుంటే, ఆ విధ్వంసానికి అడ్డుకట్ట వేయగల ఈ Fly bag ను తయారు చేసిన పరిశోధక బృందం నిజంగా ప్రశంసనీయులు కదూ.

Courtesy