అత్తిపండు శరీరానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి (Vitamin C)సమృద్దిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అత్తి పండు(Figs) సూపర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఆరోగ్యాని(Health)కి కావలసిన పోషకాలు(Nutrients),యాంటీ ఆక్సిడెంట్లు(Anti Oxidants), విటమిన్లు(Vitamins), ఖనిజాలు(Minerals) అధికంగా ఉంటాయి.
ఎండిన అత్తి(Dry Figs) ఇందులో రోగనిరోధకశక్తి(Immunity Power)ని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అత్తి పండును ఎండు రూపంలో గానీ,పండుగా గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యులున్నవారు ఈ పండుని తినకూడదు.
అత్తి పండ్లు కడుపుకు చాలా మంచిదని భావిస్తారు. కానీ మీకు గ్యాస్ సమస్యలు(Gas Problems) ఉంటే అత్తి పండ్లను తినడం మానుకోవాలి. దీనివల్ల మీకు కడుపు నొప్పి, గ్యాస్, పేగు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అత్తి పండ్లు తినడం వల్ల శరీరం వేడికి గురవుతుంది. వీటిని అధికంగా తీసుకుంటే రెటీనా రక్తస్రావం(Retinal hemorrhage) కలిగిస్తుంది.
అదే సమయంలో పీరియడ్స్(Periods) సమయంలో ఎక్కువ రక్తస్రావం ఉన్నవారికి ఇది హానికరం. మైగ్రేన్(Migraine) సమస్యలు ఉన్నవారికి కూడా అత్తిపండ్లు మంచివికాదు. నిజానికి ఎండిన అత్తి పండ్లలో అధిక మొత్తంలో సల్ఫైట్(Sulphate) ఉంటుంది. ఈ సల్ఫైట్ మైగ్రేన్ సమస్యను కలిగిస్తుంది. అందువల్ల, మైగ్రేన్ రోగులు అత్తి పండ్లను తింటే వారి సమస్య మరింత పెరుగుతుంది.
అత్తిపండ్లు మీ శరీరంలో కాల్షియం లోపాని(Lack Of Calcium)కి కారణమవుతాయి. నిజానికి అత్తి పండ్లలో చాలా ఆక్సలేట్ కనిపిస్తుంది. ఇది శరీరంలో ఉండే కాల్షియంను గ్రహించేలా పనిచేస్తుంది. ఈ పరిస్థితిలో వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపానికి దారితీస్తుంది.
కిడ్నీ స్టోన్(Kidney Stones) సమస్య ఉన్నవారు అంజీర్ పండ్ల(Anjeer Fruits)ను తినకూడదు. అత్తి పండ్లలో ఉండే ఆక్సలేట్(oxalate) వారికి సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. అంజీర్ పండ్లు గోధుమ,ఊదా, పసుపు లేదా నలుపు,ఆకుపచ్చ వంటి రంగులతోను పరిమాణంలో విభిన్నంగా ఉంటాయి.
చర్మం(Skin) కొద్దిగా ముడతలు(Wrinkels) పడినట్లు మరియు తోలు వలె ఉంటుంది. వాటిని ఎక్కువగా నిల్వ కోసం ఎండిన దశలోనే ఉంచుతారు. ఎందుకంటే తాజా పండ్లు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది.
కాబట్టి అత్తి పండ్లనే కాదు ఏదైనా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యమే!