మంచూరియా(Manchuria) అందరికి ఫేవరెట్ ఫుడ్(Favorite food). ఈ డిష్ నచ్చని వాళ్ళు వుండరు. మంచూరియా సాధారణంగా సాయంత్రం పూట స్నాక్(Snack) లా తింటాం. అలా సాయంత్రం వేళలో వేడి వేడిగా మంచూరియా తింటుంటే ఉంటుంది, ఆ ఆస్వాదన గురించి మాటల్లో చెప్పలేం రుచి చూడాల్సిందే.
మంచూరియా ఇండోచైనీస్(Indo-Chinese) వంటకాల్లో పుట్టింది. మంచూరియాలో వెజ్ & నాన్ వెజ్(Veg & Non-Veg )రకాలు ఉంటాయి. అయితే కూరగాయల కలయిక తో చేసే ఈ క్రిస్పీ(Crispy),టేస్టీ డిష్(Tasty Dish) చిన్న, పెద్ద అందరికి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ.
మిక్స్ వెజిటేబుల్స్(Mix Vegetables) తో పైనా స్పైసీ గ్రేవీ(Spicy Gravy) ఆ టేస్ట్ చెప్తే తెలియదు. తింటూ ఎంజాయ్ చేయాల్సిందే. మరి ఈ మంచురియా ఎప్పుడు బయట తింటుంటాం, మరి సరదాగా మనం ఓ సారి ట్రై చేస్తే పోలే! మరి ఇంకెందుకు లేట్ రెసిపీ(Recipe) ఎలా చేయాలో తెలుసుకుందామా!
గోబీ మంచురియా
కావలసినవి:
4 పెద్ద చెంచాలు- మైదా
2 పెద్ద చెంచాలు- మొక్కజొన్న పిండి
1 – కాలీఫ్లవర్
ఉప్పు రుచికి తగినంత
మిరియాల పొడి రుచికి తగినంత
1 పెద్ద చెంచా – సోయా సాస్
రుచికోసం ఎర్ర కారం పొడి
సాస్ కోసం : 3 పెద్ద చెంచాలు – టొమాటో కెచెప్
2 పెద్ద చెంచాలు – సోయా సాస్
1 చెంచా – వెనిగర్
1 చెంచా- గ్రీన్ చిల్లీ సాస్
అజినమోటో తగినంత
1 – ఉల్లిపాయ
1 – క్యాప్సికం
4 పెద్ద చెంచాలు – ఉల్లికాడలు ఆకుపచ్చవి, తరిగినవి
తెల్లమిరియాలు రుచికి
2 – పచ్చి మిరపకాయలు
1 చెంచా – అల్లం మరియు వెల్ల్లుల్లి, సన్నగా తరిగినవి
2 పెద్ద చెంచాలు – దోరగా వేయించడానికి నూనె
నూనె వేయించడానికి సరిపడినంత
తయారు చేయు విధానం :
- సాస్ తయారు చేయడానికి: ప్యానులో 2 పెద్ద చెంచాల నూనెను వేడి చేయండి, అల్లం మరియు వెల్లుల్లిని వేసి దోరగా వేయించండి తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు అపారదర్శకంగా అయినప్పుడు క్యాపికం జోడించండి. ఉప్పు, మిరియాలపొడి, ఎర్ర కారం వేసి కలపండి.
- అజినమోటో, మిగిలిన అన్ని సాసులని వేయండి, అధిక మంటలో నిరంతరాయంగా వేయించండి.
- ఉడకడానికి 1 కప్పు నీటిని కలపండి తర్వాత మొక్కజొన్న్ పిండి మరియు నీటి యొక్క ముద్దని చేయండి, దానిని సాస్ లోకి జోడించండి. కలిపి మంటను ఆపేయండి.
- మొక్కజొన్న పిండి, మైదా, ప్=మిరియాలపొడి, ఉప్పు, అజినమోటో మరియు సోయా సాస్ 1 స్పూన్ తో కారుతున్న పిండిని తయారు చేయండి.
- కాలీఫ్లవర్ పువ్వులను పిండిలో ముంచండి మరియు అవి కరకరలాడే దాకా బాగా వేయించండి.
- తక్కువ మంటలో సాస్ ని వేడి చేయండి, దానిలో కాలీఫ్లవర్ ను వేయండి, దాన్ని మంచిగా కలపండి. సాస్ కాలీప్లవర్ పువ్వులని పూర్తిగా అంటుకునేలా చూసుకోండి. కొన్ని ఉల్లికాడల ఆకులు జల్లండి. వేడిగా వడ్డించండి.
పనీర్ మంచురియా కావలసినవి:
తరిగిన పనీర్ 1 కప్
స్ప్రింగ్ ఆనియన్ 1 కప్
1/4 కప్ మైదా
కార్న్ ఫ్లోర్ 3 చెంచాలు
ఉప్పు తగినంత
1/2 చెంచా కారం
1 చెంచా నువ్వుల నూనె
1/2 చెంచా వెల్లులి
1/2 చెంచా అల్లం
1/4 కప్ తరిగిన కాప్సికం
1 1/2 కప్ సొయా సాస్
1 1/2 టమాట సాస్
1 1/2 చెంచా చిల్లి సాస్
నీళ్లు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
- ముందుగా పనీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
- ఇప్పుడు ఒక గిన్నె లో మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
- ఇప్పుడు పోయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
- ఇప్పుడు తరిగిన పనీర్ ముక్కలని ఆ పిండిలో ముంచి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
- ఇప్పుడు ఒక కడాయి లో నువ్వుల నూనె వేసి కాచుకోవాలి
- అందులో తరిగిన అల్లం ,వెల్లులి వేసి వేయించుకోవాలి
- వేగిన తరువాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ,కాప్సికం వేసి వేయించాలి
- వేగిన తరువాత సొయా సాస్, టమాటో సాస్ ,చిల్లీ సాస్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
- అందులో వేయించిన పనీర్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే
ముష్రూమ్ మంచురియా
కావలసినవి :
½ కప్ ఆల్-పర్పస్ ఫ్లోర్,
3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్,
1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్,
½ tsp నల్ల మిరియాల పొడి,
1 tsp సోయా సాస్
ఉప్పు, చక్కర – తగినంత
తయారు చేయు విధానం:
- ⅓ కప్పు నీరు వేసి మెత్తగా పిండిని తయారు చేయండి. మరి గట్టిగా, జారుగా కాకుండా మధ్యస్థం గా పిండి కలుపుకోవాలి.
- పుట్టగొడుగులను శుభ్రం చేసి, తుడవండి మరియు సగానికి తగ్గించండి.
- పిండిలో పుట్టగొడుగులను ముంచండి.
- వేయించడానికి ఒక ఫ్రై పాన్ పెట్టి అందులో నూనె పోసి లేదా లోతైన నూనె వేడి చేయండి. నూనె మధ్యస్తంగా వేడి అయిన తర్వాత, పుట్టగొడుగులను వేయించుకోవాలి.
- పుట్టగొడుగులు బంగారు రంగులోకి మారిన తర్వాత, వాటిని తీసి పక్కన పెట్టండి.
- మరొక పాన్‌లో నూనె వేడి చేయండి. అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వాటిని ఒక నిమిషం పాటు వేయించాలి.
- 2-3 తరిగిన పచ్చి మిరపకాయలు, 1 tsp సన్నగా తరిగిన సెలెరీ, 2 tsp వెల్లుల్లి, 2 tsp అల్లం మరియు కొన్ని స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేయని. ఒక నిమిషం పాటు మిక్స్ చేయండి.
- తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త మెత్తపడే వరకు వేయించాలి.
- చివరగా ఉప్పు, పంచదార,పుట్టగొడుగులు,1 టేబుల్ స్పూన్ సోయా సాస్ మరియు ½ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి.