ఈ రోజుల్లో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం (Skin broken) లేదా చర్మం ( Skin ) పొడి బారి(Dryness), దురద(Itching) రావడం, ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి.
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖం (face)పై ముడతలు (Wrinkles) వస్తూ ఉంటాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది.
కొన్ని పద్దతులతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు. ముఖానికి సంబంధించిన కొన్ని వ్యాయామాలు (exercise) చెయ్యడం ద్వారా ఇది సాధ్యం.
కండరాల్ని బిగువు(Fit Muscles)గా ఉంచేందుకు, రక్త ప్రసరణ(Blood Circulation)ని పెంచేందుకు ఈ వ్యాయామం తోడ్పడుతుంది. అన్నిటి కంటే మించి, యవ్వనం సొంతం చేసుకోవడానికి మీకు అందించే మంచి చిట్కాలే ఈ చిన్న చిన్న వ్యాయామాలు.
మనం తరచూ కనుబొమ్మలు (eye brows) ముడి వెయ్యడం లేదా కను బొమ్మలు పైకి అంటూ వుండటం వల్ల నుదిటి పైన ముడతలు వస్తుంటాయి. ఈ ముడతలు రాకుండా చెయ్యడానికి కొన్ని వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. మీ నుదుటిపైన చూపుడు వేలు (finger), బొటన వేలి (thumb)తో రెండు కనుబొమ్మలని పట్టుకుని కంటి వైపుగా సున్నితంగా లాగాలి.
అలాగే పై వైపుగా కూడా లాగాలి. ఇలా కనీసం పది సార్లు చెయ్యాలి. కంటి చివర్ల ఉన్న ముడతల (wrinkles) నివారణ కోసం కళ్ళు గట్టిగా మూసుకుని మీ కనుబొమ్మలని ఎత్తండి. మీరు సహజంగా విశ్రాంతి పొందే స్థితిలో ఉండి 3 సెకండ్ల పాటు ఈ పద్దతిని పాటించండి. ఇదేవిధంగా పది సార్లు చెయ్యండి.
మనిషి నిల్చుని, తల (head)ని కొంచెం వెనక్కి అనాలి. ఇప్పుడు మీ కళ్ళని పై కప్పు వైపు తిప్పాలి. మీ పెదాలని కొంచెం పైకి లాగి పై కప్పుని చుంబించడానికి ప్రయత్నిస్తున్నట్ట్లుగా ఉండాలి. ఈ పోజీషన్ (position) లో 5 సెకండ్ల పాటు ఉండాలి. కనీసం పది సార్లు ఈ వ్యాయామం చెయ్యాలి.
ముఖానికి (face) సంబంధించిన వ్యాయామాల ద్వారా అందమైన,మృదువైన, బిగుతైన చర్మాన్ని పొందవచ్చు. మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, తుడుచుకుని చర్మం (skin) పొడిగా అయ్యేవరకు ఉండాలి. ఇప్పుడు ఏదైనా లోషన్ ని లేదా మాయిశ్చరైజర్(Moisturizer) ని ముఖం పైన మర్దనా చేస్తున్నట్లుగా రాయాలి.
థెరపిస్ట్(Therapist) చేత చేయించుకున్నా మీరు చేసుకున్నా.. ముఖానికి (face) చేసుకునే మర్దనా సమయం 20 నిమిషాలు మించకూడదు. ఏంతో జాగ్రత్తగా మర్దనా చెయ్యాలి. నుదుటిని, ముక్కుని మర్దన చెయ్యడం వల్ల ముఖం పైన ఉండే అడ్డ గీతాలు తగ్గుతాయి. బుగ్గలు(Cheeks), నోటి(Mouth) చుట్టూ మర్దన(Massage) చెయ్యడం వల్ల కొత్తగా ముడతలు రాకుండా ఇంకా చర్మం సాగిపోకుండా ఉంటుంది .
గడ్డాన్ని, మెడ (neck)ని మర్దనా చేసే సమయంలో విస్మరించకూడదు. వీటికి జాగ్రత్తగా మర్దన చెయ్యడం వల్ల కండరాలు బిగుతుగా ఉండడమే కాకుండా చర్మం సాగిపోకుండా రక్షించుకు(Protects)నే వీలవుతుంది.