ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌(Job Notification) జారీ చేసింది. ఇందులో భాగంగా అప్పర్ డివిజన్ క్లర్క్(Upper Division Clerk), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi Tasking Staff) & స్టెనోగ్రాఫర్(Stenographer) పోస్టుల కోసం ఆన్‌లైన్(Online) దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్‌(official Notification)ను విడుదల చేసింది. ఈఎస్ఐసి ESIC రిక్రూట్‌మెంట్ 2022 కింద మొత్తం 3847 ఖాళీలు ప్రకటించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు, ఈఎస్ఐసి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022 కింద 3847 పోస్ట్‌ లకు దరఖాస్తు చేయడానికి ముందు ప్రాంతాల వారీగా వివరణాత్మక నోటిఫికేషన్ జారీ చేయబడింది. వీటిలో తెలంగాణ (telangana), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి.   ESICకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ చదవండి

మొత్తం 3847 ఖాళీలకు గాను అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ 1726, స్టెనోగ్రాఫర్‌ 163, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ 1931 పోస్టులు ఉన్నాయి. వీటిలో తెలంగాణ(Telangana)లో యూడీసీ(UDC) 25, స్టెనో(STENO) 4, ఎంటీఎస్‌(MTS) 43, ఏపీ(AP)లో యూడీసీ(UDC) 7, స్టెనో(STENO) 2, ఎంటీఎస్‌(MTS) 26 ఖాళీలు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు యూడీసీ పోస్టులకు డిగ్రీ(Degree) పూర్తిచేసి కంప్యూటర్‌ పరిజ్ఞానం(Computer Knowledge) ఉండాలి. స్టెనో పోస్టులకు ఇంటర్‌(Inter) ఉత్తీర్ణులై నిమిషానికి 80 పదాలు టైప్‌(Type) చేసే సామర్థ్యం ఉండాలి. ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి(Tenth Class) పాసవ్వాలి. అభ్యర్థులు(Candidates) 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు(Age)  కలిగి ఉండాలి.

ముఖ్యమైన సమాచారం:

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులను రాత పరీక్ష(Written Exam) ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • స్టెనో అభ్యర్థులను మెయిన్‌, స్కిల్‌ టెస్ట్‌, ఎంటీఎస్‌ అభ్యర్థులను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ విధానంలో ఉంటుంది.
  • దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 15న ప్రారంభం కానున్నాయి.
  • చివరి తేదీ(Last Date)గా ఫిబ్రవర్‌ 15ను నిర్ణయించారు.
  • పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్(Official Web Site) ని సందర్శించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:                    

  • ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ esic.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • హోమ్ పేజీలో “రిక్రూట్‌మెంట్(Recruitment)” ట్యాబ్ కోసం శోధించండి.
  • రిక్రూట్‌మెంట్ ట్యాబ్ కింద, మీరు (ESIC) విడుదల చేసిన పోస్ట్‌ ల నోటిఫికేషన్‌ ఉంటుంది.
  • అభ్యర్థులు తమ అర్హత(Qualification)కు సంబంధించిన పోస్ట్ ను సెలక్ట్ చేసుకోండి
  • మీరు రిజిస్ట్రేషన్ పేజీ పై క్లిక్ చేసి, తమ పూర్తి వివరాలను అప్లోడ్(Upload) చేసి చేయాలి.
  • మీ రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియను ధృవీకరించడానికి మీ నమోదిత మొబైల్(Mobile) కు OTP పంపబడుతుంది. మీరు ESIC పోర్టల్‌లో ఆ OTP నంబర్‌(OTP Number)ని ఎంటర్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్ధారించిన తర్వాత, మీరు దరఖాస్తు ఫారమ్‌(Application Form)ను పూరించగలరు. ఇక్కడ మీరు అవసరమైన వివరాలను పూరించాలి మరియు అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి.
  • మీ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి, అభ్యర్థులు తమ దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
  • దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్(Download) చేసుకోవాలి మరియు తదుపరి పరీక్ష ప్రక్రియ కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటౌట్(Print Out) తీసుకోవాలి.