మనుషులలో ఎన్నో భావోద్వేగాలు. వాటిలో మనిషికి తగ్గట్టు ఎన్నో వైవిధ్యాలు కూడా. అయితే సమయం, సందర్భం బట్టి వాటిని బయట పెడుతుంటారు. అవసరం అయితే దాచేస్తుంటారు కూడా. అందువల్లేనెమో మనకు ఓ సామెత ఉంది – లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అని. దీనిని కొద్దిగా మార్చి ఎవరి మనసులో ఏముందో, ఎవరిలో ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు అని కూడా అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అది తెలుసుకునే పనిలోనే చాలా మంది పరిశోధకులు ఉన్నారు. ఇప్పటికే మానవ భావోద్వేగాలను గుర్తించేందుకు కంప్యూటర్లకు శిక్షణ ఇస్తున్నారు.

మనుషుల ముఖ కవళికలు, స్వరాన్ని బట్టి ఆ వ్యక్తి భావనను పసి గట్టేందుకు కొన్ని algorithm ల ద్వారా కొన్ని కంప్యూటర్లు ఆ పని చేస్తున్నాయి. అయితే పెద్ద పెద్ద పరికరాలు అవసరం లేకుండా కేవలం వైర్లెస్ పరికరం ద్వారా అవతలి వ్యక్తి భావోద్వేగాలను తెలుసుకోగలిగితే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే పని చేసారు. MIT (Massachussetts Institute of Technology) కి చెందిన CSAIL (Computer Science and Artificial Intelligence Laboratory) లోని ప్రొ. Katabi బృందం.

Katabi బృందం మనుషుల భావోద్వేగాలను చదివేందుకు మన వై ఫై రౌటర్ అంత పరిమాణం లో ఉండే పరికరాన్ని తయారు చేసారు. దీని నుంచీ వచ్చే వైర్లెస్ సిగ్నల్స్ ఆ క్షణం మన భావోద్వేగాలు ఎలా ఉన్నాయో చెప్పేస్తుంది. EQ Radio అని పిలువబడే ఈ పరికరం పని తీరు ఇలా ఉంటుంది. దీని నుంచో వచ్చే సిగ్నల్స్ మన శరీరాన్ని తాకగానే తిరిగి వెనక్కు వెళ్తాయి. ఈ క్రమoలో మన గుండె చప్పుడు (heart beat), మన ఉచ్వాస నిశ్వాసలు ఎలా ఉన్నాయో ఆ సమాచారం కూడా రౌటర్ కు చేరిపోతుంది. ఇక దీనిలో ప్రత్యేకంగా రూపొందించిన algorithm ఈ సమాచారాన్ని విశ్లేషించి మనం ఆ క్షణంలో ఎలా ఉన్నామో చెప్పేస్తుంది. ఇలా ఈ రేడియో సంతోషం, బాధ, కోపం, ఇష్టం వంటి భావాలను కనిపెట్టేస్తుంది. మనలోని ఏ భావానికైనా అద్దం పట్టేది మన గుండె చప్పుడు అలాగే ఊపిరి. ఇలాంటి Emotion Recognition కొరకు కంటికి కనిపించని వీటిని లెక్కకట్టడం కోసం వైర్లెస్ సిగ్నల్స్ ఉపయోగించడం దీని విశిష్టత.

ఇక ఇది 87 శాతం మేర ఖచ్చితంగా పని చేస్తుందని తేలింది. సరే, ఇంతకీ ఇది ఇక్కడ పనికొస్తుంది అంటే, psychiartry వంటి వైద్య విధానాల్లోను, వినోద రంగంలోనూ (సినిమాలు, గేమింగ్ మరియు రిటైల్) ఇది ఉపయోగపడుతుంది. అయితే దీని వాడకం పట్ల కొన్ని అభ్యంతరాలు తలెత్తనున్నాయి. ఎందుకంటే అవతలి వారి ప్రమేయం లేకుండా వారి గురించి తెలుసుకోవడం అనైతికం అనిపించుకుంటుంది. అందువల్ల దీనిని ఉపయోగించాల్సి వస్తే అవతలి వారి సమ్మతితోనే చేయాలని ఈ బృందం అభిప్రాయ పడుతున్నారు.

Katabi బృందం ఈ EQ Radio ను ఒక Mobile Computing Conference లో ప్రదర్శించనున్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధిచెందుతున్న ఈ రోజుల్లో ఈ emotion recognition మన ఫోన్లో అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరం లేదు అని అన్నారు Katabi.

Courtesy