గత కొన్ని సంవత్సరాలుగా వాహన వినియోగం బాగా పెరిగింది. ఇంటింటా బైక్ లు, స్కూటీ లు, కార్లు మామూలు అయిపోయాయి. వాహనాల్లో వాడే ఇంధనం వల్ల జరిగే పర్యావరణ కాలుష్యం అంతా ఇంతా కాదు. దీనిని గుర్తించాయి కాబట్టే ప్రపంచ దేశాలు దీనికి ప్రత్యామ్న్యాయ మార్గాలను వెతుకుతున్నాయి. అలా ఎలక్ట్రిక్ కార్లు ఆవిర్భవించాయి. అయితే ఇది పూర్తి స్థాయి లో ఎక్కడా వినియోగించడం లేదు. అందుకు కారణాలు ఎన్నో. అందులో ఒకటి మైలేజ్. అలాగే ఎలక్ట్రిక్ కారులో దూర ప్రయాణాలు చేయటం వంటి ఎన్నో సందేహాలు. ఇటువంటి మన సందేహాలకు సమాధానాలను వెతికే ప్రయత్నంలో Xudong Wang అనే శాస్త్రవేత్త చేసిన ఒక ప్రయోగమే ఈ ఎలక్ట్రిక్ టైరు. అదేంటో మనం తెలుసుకుందాం.
అమెరికా లోని విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ (Wisconsin-Madison University) కి చెందిన ఒక ప్రొఫెసర్ ఎలక్ట్రిక్ కారు నడుస్తుండగానే దాని యొక్క శక్తిని గ్రహించి తిరిగి మళ్ళీ అదే శక్తిని కారుకు అందించాడు. అంటే కారు టైర్లకు ఎలక్ట్రోడ్స్ ను అమర్చితే ఆ కారు టైర్లు నేల మీద తిరగడం వల్ల భూమికి టైరుకు మధ్య ఉండే ఘర్షణ శక్తిని పుట్టిస్తుంది. దీనినే ”ట్రైబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్” (Triboelectric Effect) అంటారు. ఈ శక్తినే తిరిగి మరల కారులోని నానో జనరేటర్ (NanoGenerator) కు అందించడం వల్ల అది కారుకు అవసరమైన ఎలక్ట్రికల్ ఎనర్జీ ను ఇస్తుంది. దీని వల్ల కారులోని బాటరీ అయిపోయిన ఎక్కడ ఆగిపోతుందోనన్న భయం అవసరం లేదు. ఈ శక్తి కారు టైర్లు, దాని వేగం మొదలైన వాటి మీద ఆధారపడి వుంటుంది.
ఇదేదో మనకు తెలియనిది కాదు. మన నిత్య జీవితంలో మనకు అనుభవమే. బెలూన్ ను తల మీద రుద్దితే ఆ రాపిడి ఘర్షణ వలన మన తల వెంట్రుకలు లేచి నిలబడతాయి. అటువంటిదే ఈ ట్రైబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కుడా.
అయితే ప్రస్తుతానికి దీన్ని ఇంకా పరీక్షిస్తున్నారు. అన్నివిధాలా పరీక్షించి, ఇది మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది అంటున్నారు ఈ ప్రాజెక్ట్ కు చెందిన శాస్త్రవేత్తలు.
అయితేనేమి? ఇది త్వరగా సక్సెస్ అయి అందరికి అందుబాటులోకి రావాలని కోరుకుందాం. ఎందుకంటె ఇటువంటి ప్రయోగాలూ మానవులకు ఉపయోగపడడమే కాకుండా, పర్యావరణాన్నికూడా కాలుష్యం (Global Warming) నుంచి సంరక్షిస్తాయి.