మనకు తెలియకుండానే మన శరీరము(Body)లో కీలక పాత్ర(key Role) పోషించే భాగం దంతాలే.
ఆహారం నమలటానికి మాత్రమే కాదు అందాన్ని ఇనుమడింప చేయడంలోనూ దంతాల పాత్ర ఎనలేనిది. అంత కీలకమైన దంతాలకు మరింత ముఖ్యమైనది ఎనామిల్(Enamel) పొర.
పంటి మీద ఏర్పడిన ఈ ఎనామిల్ పొర పంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా పంటిని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి ఎనామిల్ పొర అరిగిపోతుంటే ఏం చేయాలి? అసలు దీనికి పరిస్కారం వుందా తెలుసుకుందాం!
మన దంతాలు డెంటిస్ట్(Dentist) అనే ఎముక(Bone) తో తయారవుతాయి. ఇవి ఆమ్లాలు(Acids), క్షరాల(Alkaline) ప్రభావానికి తేలికగా ధ్వంసమవుతాయి.
మాంసాహారంలో బొమికలు(Bones), కొన్ని రకాల గింజలు(Types of SEEDS), పప్పులు(lentils) నమిలితే విరిగిపోతాయి. ఈ ప్రమాదం తప్పించేందుకు సహజ సిద్దంగానే పళ్ళ పైన ఎనామిల్ అనే తెల్లని పొర(White Layer) ఉంటుంది.
ఎనామిల్(Enamel) మన దేహంలోని అన్ని ఎముకులం(Bones)టే అత్యంత దృఢమైంది(Strong) ఈ ఎనామిల్ వల్ల దంతాలు గట్టిగా తయారవుతాయి.
ఎనామిల్ లో ప్రధానంగా కాల్షియమ్(Calcium), ఫాస్ఫరస్(Phosphorus) మూలకాలు, బలమైన రసాయన బంధంతో కలిసిపోవడం వల్ల రోజు వారి తినే ఆహార పదార్దాలతో చర్య జరిగి పళ్ళు పాడవకుండా ఓ రక్షణ కవచంలా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్న కృత్రిమ ఎనామిల్(Artificial Enamel) ఇప్పటికి తయారు చేయలేకపోయామంటేనే తెలుస్తోంది కదా!
ఎనామిల్ ఎంత ముఖ్యమైనదో చింత పండు(Tamarind)లో వుండే టార్టారిక్ యాసిడ్(Tartaric Acid), నిమ్మ రసం(Lemon)లోని సిట్రిక్ ఆమ్లం(citric Acid), కూల్ డ్రింక్స్(Cool Drinks) లోని ఫాస్పోరిక్ ఆమ్లం(Phosphoric Acid), కార్బోనిక్ యాసిడ్లు(Carbonic acid) ఎనామిల్ లోని కాల్షియమ్, ఫాస్ఫోర్ల రసాయన బంధాన్ని విచ్చిన్నం చేస్తాయి. దాంతో ఎనామిల్ పొరలు పొరలుగ్గా కరిగిపోయి పళ్ళు పసుపు పచ్చగా మారుతాయి.
క్రమంగా దంతాలు సేన్సిటివిటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి మొత్తాన్ని బ్రష్(Soft brush) తోనే పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకునేటపుడు గట్టిగా రుద్దకూడదు. ఒక పద్ధతి ప్రకారం బ్రష్ చేయాలి. ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్రష్ ని తప్పని సరిగా మార్చాలి.
మాంసాహారం తిన్నప్పుడు తప్పని సరిగా పళ్ళు తోముకోవాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్దాలను వెంటనే తీసివేయాలి సాధ్యమైనంత వరకు చాకోలెట్స్(CHOCOLATES) , స్వీట్స్(Sweets), ఐస్ క్రీమ్స్(Ice Creams) తగ్గించాలి. పచ్చి కూరలు(RAW-VEGETABLES), పండ్లు(Fruits) ఎక్కువగ్గా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో అరిగిపోయిన ఎనామిల్ సమస్య వల్ల పాడైన పళ్ళను సరి చేసేందుకు అనేక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
దంతాలు(Teeth) వరుస క్రమంలో లేకపోయినా లేదా అక్కడక్కడా దొంతర పళ్ళు(Stacked Tooth)వున్న వాటి రూపాన్ని సరి చేసి అందం తీర్చి దిద్దడానికి చేసే చికిత్స విధానమే(Treatment) ఎనామిల్ షేపింగ్(Enamel Shaping).
ఎనామిల్ షేపింగ్ చికిత్సల్లో కొన్ని దంతాలకు ఎనామిల్ తొలగించడం లేదా ఇతర దంతాలతో సమాన రీతిలో సరి చేసి దంత సౌందర్యాన్ని పెంచడానికి చికిత్స చేస్తారు పగిలిన(Broken) లేదా బీటలు(Cracked) వారిన దంతాలను ఎనామిల్ షేపింగ్ ద్వారా సరి చేస్తారు.
బాండింగ్(Bonding) విధానమా ద్వారా దంతాలు కొన్ని రకాల రంగు పదార్దాలను వేయడం ద్వారా దంతాలన్నీ ఒకే రంగు(Color)లో కనిపించేలా చేస్తారు. అయితే దంత సౌందర్యానికి సంబంధించిన సమస్యలన్నిటినీ ఎనామిల్ షేపింగ్ ద్వారా పరిష్కరించలేము.
దొంతర పళ్ళు(Stacked Tooth) మరి ఎక్కువగా ఉంటే బ్రేసస్(Brasus) అవసరమవుతాయి.కొన్ని సార్లు ఎనామిల్ పోతే తిరిగి దాన్ని సరి చేయడానికి ఇతర పద్ధతులు(Different Methods) అవళింభించాల్సి ఉంటుంది