ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) లో చేరడమే మీ కల. అయితే మీ కల ను సాకారం చేసుకునేందుకు ఇండియన్ ఫోర్స్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు (Application) కోరుతున్నారు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defense Government of India) నేతృత్వంలో గ్రూప్ సీ సివిలియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎల్డీసీ (LDC), సూపరింటెండెంట్, ఎంటీఎస్, స్టోర్ కీపర్,టెయిలర్, ట్రెడ్స్మెన్ మెట్, కార్పెంటర్,హ వంటి వివిధ పోస్ట్లు విడుదల చేసారు.
ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు ? ఎన్ని ఖాళీలు ఉన్నాయో? తదితర వివరాలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 197 ఖాళీలు జారీ చేయనున్నారు.
అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ , స్కిల్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు
దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి, గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: దరఖాస్తుల స్వీకరణకు 07.09.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత వివరాలను నమోదు చేయాలి. తరువాత దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో సబ్మిట్ చేయాలి.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianairforce.nic.in/ వెబ్సైట్ చూడొచ్చు.