నీరు, మానవాళి మనుగడకు అత్యవసరమైనది. అయితే కేవలం నీరు ఉంటే సరిపోదు, మన నిత్యావసరాల కోసం ఆ నీరు శుద్ధంగా ఉండాలి. లేదంటే ఎన్నో రోగాలు వస్తాయి. ఇందుకోసం మనకు ఎన్నో “Water Filtering Techniques” అందుబాటులో ఉన్నాయి. . ప్రాంతాల వారీగా నీటిని శుద్ధి చేసి ఆ నీటిని ప్రజలకు అందిచడానికి “Reverse Osmosis” వంటి పద్ధతులు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇవి ఆయా దేశ, ప్రాంతాల దృష్ట్యా వీటిని వియోగిస్తుంటారు. ఎందుకంటే Egypt వంటి దేశాల ఆర్దిక పరిస్థితికి ఈ Reverse Osmosis కూడా ఖర్చుతో కూడుకున్నది ఇంకా ఎంతో విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది. అందువల్ల అక్కడి ఆర్దిక అవసరాల దృష్ట్యా ప్రజల కోసం వారు మరింత చౌకగా నీటిని శుద్ధి చేసే పద్ధతులను అన్వేషిస్తుంటారు.

Water Purification

ఇందులో భాగంగా Egypt లో ఒక కొత్త పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తున్నారు, దానినే Prevaporator అంటారు. ఈ పద్ధతిలో Cellulose Acetate Powder కలిగిన membranes మురికి పదార్ధాలను తొలగిస్తాయి. ఆ తరువాత మిగిలిన నీటిని మరిగించి ఆవిరి చేస్తుంది. అప్పుడు ఇందులో ఏమైనా మలినాలు ఉంటే తిరిగి ఈ నీరు ఘనీభవించి (Condensation) అక్కడ నుంచి తిరిగి నీరుగా మారే ప్రక్రియలో తొలగిపోతాయి. దాంతో సురక్షితమైన మంచి నీరు లభిస్తుంది. ఈ పద్ధతిలో చాల తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. అందువల్ల ఇది Egypt వంటి ఆర్ధికంగా వెనుకబడిన దేశాలకు కూడా తక్కువ ఖర్చుతో నీటిని ఇవ్వగలదు.

Water Purification

ఈ పరిశోధనా, దాని ఫలితాలను “Water and Science Technology” Journal లో August 2015 లో ప్రచురించారు

 

Courtesy